నా పేరు సోనూ సింగ్.. అని చెప్పడంతో ప్రేమలో పడిన వివాహిత.. తీరా అతడి ఇంటికి వెళ్లిన ఆమెకు.. అసలు విషయం తెలిసి..
ABN, First Publish Date - 2022-12-18T16:16:38+05:30
వివాహమై.. రెండేళ్ల కొడుకు ఉన్న మహిళ అత్తమామల వేధింపులతో విసిగిపోయింది. దీంతో చివరకు అక్కడ ఉండలేక పుట్టింటికి వెళ్లింది. ఆవేదనలో ఉన్న ఆమెకు ఫోన్‌లో ఓ అపరిచత వ్యక్తి..
వివాహమై.. రెండేళ్ల కొడుకు ఉన్న మహిళ అత్తమామల వేధింపులతో విసిగిపోయింది. దీంతో చివరకు అక్కడ ఉండలేక పుట్టింటికి వెళ్లింది. ఆవేదనలో ఉన్న ఆమెకు ఫోన్‌లో ఓ అపరిచత వ్యక్తి పరిచయమయ్యాడు. నా పేరు సోనూ సింగ్.. అని చెప్పగానే అతన్ని ఎంతో నమ్మింది. రోజూ మాట్లాడే క్రమంలో అతడితో ప్రేమలో పడింది. ఓ రోజు యువకుడు తన ఇంటికి పిలవడంతో వెంటనే వెళ్లింది. అయితే తీరా అక్కడికి వెళ్లాక ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..
ప్లీజ్.. ఒక్క గంట ఆగండి.. పెళ్లయ్యాక నన్ను అరెస్ట్ చేసుకోండి.. పోలీసులను ఆ వరుడు వేడుకున్నా..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఫతేపూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ప్రస్తుతం రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల ఆమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా భరిస్తూ వచ్చింది. కానీ రోజురోజుకూ వేధింపులు (Harassment) ఎక్కువ అవుతుండడంతో భరించలేక పుట్టింటికి వెళ్లింది. కొన్ని నెలలుగా ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఇటీవల ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ‘‘నా పేరు సోనూసింగ్.. నేను క్షత్రియ కుటుంబానికి చెందినవాడిని’’.. అని చెప్పడంతో మాట్లాడింది. అప్పటికే మానసిక ఒత్తిడిలో ఉన్న ఆమెకు.. అతడి మాటలు ధైర్యాన్ని ఇచ్చాయి. ఇలా కొన్నాళ్లకే అతడిని మాగా నమ్మింది. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ (love) మొదలైంది. రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉండేవారు.
డిసెంబర్ 14న ఆమెకు ఫోన్ చేసి కలవాలని చెప్పడంతో అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఆమెతో కొద్ది సేపు మాట్లాడిన అతను.. తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లాక.. అతడు ముస్లిం కుటుంబానికి చెందిన వాడని తెలిసింది. దీంతో, ఎందుకు అబద్ధం చెప్పావని అతన్ని నిలదీసింది. ఈ విషయంలో కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. ‘‘నువ్వు కూడా మతం మార్చుకో’’.. అంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె అంగీకరింకపోవడంతో బలవంతంగా అఘాయిత్యానికి (Sexual harassment) పాల్పడ్డాడు. ఆమెను ఇంట్లోనే బంధించి.. మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడు. తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. చివరకు బాధితురాలిని రక్షించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
Updated Date - 2022-12-18T16:18:52+05:30 IST