కళాశాల వద్ద అదే పనిగా తిరుగుతున్న యువకులు.. అనుమానం వచ్చి బ్యాగుల్లో తనిఖీ చేయగా..
ABN, First Publish Date - 2022-12-08T21:02:50+05:30
కొందరు యువకులు మత్తుపదార్థాలకు బానిసై.. వివిధ నేరాలకు పాల్పడడం పరిపాటిగా మారిపోయింది. మరికొందరు యువకులు.. విద్యార్థులను టార్గెట్ చేసుకుని..
కొందరు యువకులు మత్తుపదార్థాలకు బానిసై.. వివిధ నేరాలకు పాల్పడడం పరిపాటిగా మారిపోయింది. మరికొందరు యువకులు.. విద్యార్థులను టార్గెట్ చేసుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇలాంటి కేసులు పెరిగిపోయాయి. తాజగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ కళాశాల వద్ద కొందరు యువకులు అదే పనిగా తిరగుతూ కనిపించారు. అనుమానం వచ్చి వారి బ్యాగులు తనిఖీ చేయగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..
55 ఏళ్ల ఉపాధ్యాయుడి బ్యాంక్ అకౌంట్లో రూ.21.53 లక్షలు మటాష్.. ఆయన చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో..
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) గుంటూరు జిల్లాలో మత్తుపదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు ముఠా సభ్యులు విద్యార్థులను (students) టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయాలు (marijuana Sales) సాగిస్తున్నారు. ఇటీవల గుంటూరు నగరం పాలెం పరిధిలోని మెడికల్ కాలేజీ వద్ద కొందరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. చూడటానికి విద్యార్థుల్లాగా బ్యాగులు పట్టుకుని ఉన్నా.. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. బ్యాగుల్లో పరిశీలించగా.. భారీ స్థాయిలో గంజాయి బయటపడింది.
అయితే ఈ క్రమంలో ఇద్దరు యువకులు పోలీసుల కళ్లగప్పి గోడదూకి పారిపోగా.. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఆకులుగా విక్రయించడం, కొన్నిసార్లు పొడి రూపంలో, మరికొన్నిసార్లు సిగరెట్ల రూపంలో విక్రయిస్తున్నారని తెలిసింది. గంజాయి అక్రమ రవాణా.. విశాఖ ఏజెన్సీ (Visakha Agency) నుంచి జరుగుతున్నట్లు గుర్తించారు. కళాశాలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిన మహిళ.. గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే..
Updated Date - 2022-12-08T21:02:55+05:30 IST