వాహనాల తనిఖీలో పట్టుబడ్డ ప్రేమికులు.. విచారించగా బయటపడ్డ మహిళ వివాహేతర సంబంధం..
ABN, First Publish Date - 2022-11-04T19:38:51+05:30
సంతోషంగా సాగుతున్న వారి సంసారంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రియుడితో కలిసి ఆమె చేసిన దారుణంపై ఆరు నెలల క్రితం కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రేమికులు.. ఎట్టకేలకు వాహనాల తనిఖీ సందర్భంగా పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని..
సంతోషంగా సాగుతున్న వారి సంసారంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రియుడితో కలిసి ఆమె చేసిన దారుణంపై ఆరు నెలల క్రితం కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రేమికులు.. ఎట్టకేలకు వాహనాల తనిఖీ సందర్భంగా పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రియుడితో కలిసి ఆమె చేసిన దారుణం బయటపడడంతో స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
Viral Video: వీడు మనిషా.. కాదా..! కారు పక్కన నిలబడ్డ పాపానికి.. చిన్నారిని ఏకంగా..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ పరిధి అలియాపూర్ గ్రామానికి చెందిన సంతోష్‌కు భార్య ఊర్మిళ, కుమార్తె ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో భార్య కారణంగా లేనిపోని సమస్యలు వచ్చిపడ్డాయి. స్థానిక ప్రాంతానికి చెందిన సునిల్ అనే యువకుడితో ఊర్మిళకు కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. భర్త లేని సమయంలో ఆమె తన ప్రియుడితో రాసలీలలు సాగించేది. కొన్ని నెలల క్రితం ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అయినా ఊర్మిళ మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు. తరచూ ప్రియుడితో కలుస్తుండడాన్ని తెలుసుకుని భర్త భరించలేకపోయాడు. భార్యపై దాడి చేయడంతో పాటూ అందరిముందూ అవమానకరంగా మాట్లాడాడు.
దీంతో భర్తపై ఊర్మిళ పగ పెంచుకుంది. ఎలాగైనా తనను అంతమొందిచాలని ప్రియుడితో కలిసి కుట్రపన్నింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేసి పరారయ్యారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు.. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో సమాచారం అందించిన వారికి రూ.10వేల రివార్డును కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా.. నిందితులిద్దరూ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Updated Date - 2022-11-04T19:38:55+05:30 IST