ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు పిల్లల తల్లి అదృశ్యం.. మీదే తప్పంటూ మామ, అల్లుడి మధ్య గొడవ.. 32 రోజుల తర్వాత షాకింగ్ ట్విస్ట్..!

ABN, First Publish Date - 2022-12-17T20:49:52+05:30

భర్త, పిల్లలు ఉన్న మహిళలు కూడా.. కొన్నిసార్లు బాధ్యతలు మరచి ప్రవర్తిస్తుంటారు. పిల్లల సంక్షేమమే ధ్యేయంగా బతకాల్సింది పోయి.. పిచ్చి పిచ్చి పనులు చేసి, అందరితో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భర్త, పిల్లలు ఉన్న మహిళలు కూడా.. కొన్నిసార్లు బాధ్యతలు మరచి ప్రవర్తిస్తుంటారు. పిల్లల సంక్షేమమే ధ్యేయంగా బతకాల్సింది పోయి.. పిచ్చి పిచ్చి పనులు చేసి, అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ ఇలాగే చేసింది. ఇద్దరు పిల్లలు ఉన్న ఆమె సడన్‌గా అదృశ్యమైంది. దీంతో మీదే తప్పు అంటే కాదు మీదే తప్పు అని మామ, అల్లుడి మధ్య గొడవ జరిగింది. తీరా 32రోజుల తర్వాత షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రైల్లో షాకింగ్ ఘటన.. అవాక్కైన ప్రయాణీకులు.. బోగీలోకి అర్ధరాత్రి ఓ ఆక్సిజన్ సిలిండర్‌ రావడం వెనుక..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) డియోరియా జిల్లా పరిధిలోని లార్ పోలీస్ స్టేషన్ గ్రామానికి చెందిన మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలావుండగా, ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి (Facebook friend) పరిచయమయ్యాడు. ఇద్దరూ రోజూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొన్నాళ్లకే అది ప్రేమగా (love) మారింది. ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. భర్త, పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయిన మహిళ.. నవంబర్ 12న ఢిల్లీలోని ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. కూతురును చూడటానికి తల్లిదండ్రులు వెళ్లగా కనిపించలేదు. దీంతో అల్లుడే తమ కూతురును ఏదో చేశాడని అనుమానించారు. ఇదే విషయంపై అల్లుడు, అతడి తల్లిదండ్రులతో గొడవపడ్డారు.

వామ్మో.. ఇది కారు డిక్కీనా..? మెడికల్ స్టోరా..? ప్రభుత్వాసుపత్రి ముందే కొత్త వ్యాపారం..!

తర్వాత అతడు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన భార్య కనిపించలేదంటూ ఫిర్యాదు చేశాడు. మరోవైపు తమ కూతురు కనిపించలేదంటూ మహిళ తండ్రి కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మొబైల్ నంబర్ ఆధారంగా (Mobile Number Tracing) దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలో ఆమె మొబైల్ చివరి లొకేషన్‌ను గుర్తించారు. తర్వాత ఆమె ఫేస్‌బుక్ స్నేహితులను పరిశీలించి, ఢిల్లీలోని ఆమె ప్రియుడిని గుర్తించారు. ఎట్టకేలకు 32రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లి ఇద్దరినీ డియోరియాకు తీసుకొచ్చారు. ఆమె కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ప్రస్తుతం ఆమెను తల్లిదండ్రుల వద్దకు పంపించారు. కేసు దర్యాప్తులో ఉంది.

పెళ్లయిన మర్నాడే షాకింగ్ ఘటన.. పాడు పని చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. చివరకు..

Updated Date - 2022-12-17T20:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising