ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెర్త్ కోసం రిక్వెస్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టి షాక్.. నేరుగా రైల్వే అధికారి వద్దకు వెళ్లి..

ABN, First Publish Date - 2022-12-12T09:23:35+05:30

ఒకసారి మా కుటుంబంతో కలిసి రైల్లో రెండో తరగతి స్లీపరు బోగీలో పుట్టపర్తి వెడుతున్నాము. మధ్యలో ఏదో స్టేషనులో ఎవరో ఎక్కారు. తీరా చూస్తే రామారావు గారు. ఆయన గవర్నర్ హోదానుంచి తప్పుకుని అప్పటికి కొద్దికాలమే అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ తరం అంతమైంది – భండారు శ్రీనివాసరావు

మెరిసే రంగురాళ్ళను, రత్నాలను కలిపి జల్లిస్తే, జల్లెడలో మిగిలే ఏకైక మేలిమి రతనం వీ.రామారావు గారు. నేటి రాజకీయుల్లో మళ్ళీ అలాంటి వాళ్ళను చూడబోము. ఆ ఉత్తమ శ్రేణికి చెందిన రాజకీయుల్లో బహుశా ఆయనే చిట్టచివరి వారు. 1978, 1984 లో శ్రీ రామారావు ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేసినప్పుడు రేడియో విలేకరిగా ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అవి చివరి వరకు కొనసాగుతూ వచ్చాయి.

రామారావు గారు సిక్కిం గవర్నర్ గా వున్నప్పుడు హైదరాబాదు వచ్చినప్పుడల్లా డార్జిలింగ్ టీ టిన్నులు తెచ్చి ఇచ్చేవారు. కుటుంబంతో కలిసి సిక్కిం రావాల్సిందని చెప్పేవారు కానీ నాకే వీలు కుదరలేదు. కానీ మా స్నేహితులు, చుట్టపక్కాల్లో ఎవరు వెళ్ళినా సరే, ఫోను చేసి చెబితే చాలు, వారికి అన్ని కనుక్కుని ఏర్పాట్లు చేసేవారు. హైదరాబాదు నుంచి ఫోను చేస్తే స్వయంగా లిఫ్ట్ చేసి మాట్లాడేవారు.

ఒకసారి మా కుటుంబంతో కలిసి రైల్లో రెండో తరగతి స్లీపరు బోగీలో పుట్టపర్తి వెడుతున్నాము. మధ్యలో ఏదో స్టేషనులో ఎవరో ఎక్కారు. తీరా చూస్తే రామారావు గారు. ఆయన గవర్నర్ హోదానుంచి తప్పుకుని అప్పటికి కొద్దికాలమే అయింది. రైల్వే అధికారి బెర్త్ ఇవ్వడం సాధ్యం కాదని అంటుంటే నేను వెళ్లి కల్పించుకుని ‘ఆయన ఎవరో మీకు తెలియదల్లే వుంది, మొన్నమొన్నటి దాకా గవర్నర్. కానీ ఆయన పదవిని వాడుకునే రకం కాకపోబట్టి మీకు తెలిసి వుండరు’ అని కాస్త డబాయింపుగా అన్నాను, రామారావుగారు ‘వద్దువద్ద’ని ఓ పక్క వారిస్తున్నా వినకుండా.

కాసేపటి తరువాత ఆయనకు వేరే బోగీలో బెర్త్ ఇచ్చారు. కానీ ఆయన మా వద్దే చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్ళారు. బీజేపీ కి చెందిన నారపరాజు రామచంద్ర రావు గారు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు ఆశీస్సులు తీసుకోవడానికి రామారావు గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి నేను కూడా వారి ఇంటికి వెళ్లాను. వేడి వేడి చాయ్ ఇచ్చి చాలాసేపు మాట్లాడారు. అదే రామారావు గారిని నేను ఆఖరి సారి కలవడం.

ఆ తరం అంతమయింది.

(డిసెంబర్ 12, శ్రీ వి. రామారావు గారి జయంతి)


భండారు శ్రీనివాసరావు

(సీనియర్ పాత్రికేయులు, రచయిత)

9849130595

Updated Date - 2022-12-12T09:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising