ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో వారితో పాటూ పక్కింటి వ్యక్తికీ టీ ఇచ్చింది.. అమె చేసిన చిన్న పొరపాటుకు..

ABN, First Publish Date - 2022-10-29T15:50:42+05:30

కొందరు ముందూ వెనుకా ఆలోచించకుండా, ఎవరినీ సంప్రదించకుండా.. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలా తెలిసీ తెలియక చేసే పనులు.. ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఆఖరికి... అయ్యో! ఎంత పొరపాటు జరిగింది అని బాధపడిపోతుంటారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ మహిళ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు ముందూ వెనుకా ఆలోచించకుండా, ఎవరినీ సంప్రదించకుండా.. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలా తెలిసీ తెలియక చేసే పనులు.. ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఆఖరికి... అయ్యో! ఎంత పొరపాటు జరిగింది అని బాధపడిపోతుంటారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ మహిళ తన భర్త, బంధువు, పిల్లలతో పాటూ పక్కింటి వ్యక్తికీ టీ ఇచ్చింది. అయితే ఈ క్రమంలో ఆమె చేసిన చిన్న పొరపాటు కారణంగా చివరకు పెద్ద ఘోరమే జరిగింది.. వివరాల్లోకి వెళితే..

దైవ దర్శనం కోసం వెళ్తుండగా.. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మెయిన్‌పురి పరిధి నాగ్లా కన్లై గ్రామంలో శివానందన్ అనే వ్యక్తికి భార్య రామ్మూర్తి, పిల్లలు శివంగ్ (6), దివ్యాంష్ (5) ఉన్నారు. శివాననందన్ వ్యవసాయ పనులు (Agricultural work) చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యా, పిల్లలతో సంతోషంగా ఉన్న వీరి కుటుంబంలో ఉన్నట్టుండి విషాద ఘటన చోటు చేసుకుంది. శివానందన్ బావ రవీంద్ర సింగ్ (55).. గురువారం వీరింటికి వచ్చాడు. దీంతో అంతా కుశల ప్రశ్నలు వేసుకుని, సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంతలో పక్కింటి వ్యక్తి సోబ్రాన్ కూడా అక్కడికి వచ్చాడు. అంతా కలిసి సరదా కబుర్లు చెప్పుకొంటున్నారు. ఈ క్రమంలో శివానందన్ భార్య... అందరికీ టీ ఇవ్వవాలని అనుకుంది. అంతా సిద్ధం చేసుకున్నాక.. ఆమెకు టీ పొడి (Tea powder) కనిపించలేదు. చుట్టూ చూడగా సమీపంలో వరిలో పిచికారీ చేసే మందు కనిపించింది. అదే టీ పొడి అని భావించి.. పాలలో కలిపి టీ సిద్ధం చేసింది. కాసేపటి తర్వాత భర్త, పిల్లలతో పాటూ మిగతా ఇద్దరికీ టీ అందించింది.

Viral Video: ఆస్పత్రిలో మహిళ పట్ల సిబ్బంది నిర్వాకం.. అంతా చూస్తుండగా..

ఆ టీ తాగిన కాసేటికే అంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. చూస్తుండగానే పరిస్థితి విషమించింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని.. వారిని చికిత్సి నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రవీంద్ర సింగ్, చిన్నారులు శింగ్, దివ్యాంష్.. మృతి చెందారని వైద్యులు తెలిపారు. శివానందన్, సోబ్రాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వరి మందు కలిపే ముందు.. భర్తను ఒక్కసారి అడిగి ఉంటే.. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదంటూ స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Viral Video: యువతి సాయం చేయగానే.. చివర్లో ఏనుగు ఎక్స్‌ప్రెషన్ చూడండి..

Updated Date - 2022-10-29T15:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising