ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడేళ్లయినా పిల్లలు లేకపోవడంతో చికిత్స చేయించుకున్న దంపతులు.. ఇటీవల మేకప్ కోసం భార్య డబ్బులు అడగడంతో..

ABN, First Publish Date - 2022-12-24T19:23:28+05:30

చాలా మంది దంపతుల్లో వివాహమైన మొదట్లో ఉన్న ప్రేమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. వివిధ సమస్యలతో మానసికంగా ఒత్తిడికి గురై కొందరు భార్యలను వేధిస్తుంటారు. మరికొందరు కావాలనే వివిధ సాకులు చూపుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా మంది దంపతుల్లో వివాహమైన మొదట్లో ఉన్న ప్రేమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. వివిధ సమస్యలతో మానసికంగా ఒత్తిడికి గురై కొందరు భార్యలను వేధిస్తుంటారు. మరికొందరు కావాలనే వివిధ సాకులు చూపుతూ చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఏడేళ్లయినా పిల్లలు లేకపోవడంతో దంపతులు చికిత్స చేయించుకున్నారు. అయితే నువ్వు అందంగా లేవంటూ భర్త రోజూ వేధించేవాడు. ఇటీవల మేకప్ కోసం భార్య డబ్బులు అడగడంతో గొడవ మరింత ముదిరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Viral Video: నెమలిలో ఇంత ఆవేశాన్ని ఎప్పుడూ చూసుండరు.. గుడ్లను ఎత్తుకెళ్తున్న యువతిని ఏం చేసిందో చూడండి..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అలీగఢ్ సివిల్ లైన్ ప్రాంతానికి చెందిన మహిళకు ఢిల్లీకి చెందిన యువకుడితో 2015లో వివాహమైంది. భర్త ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వివాహమైన మొదట్లో భార్యను బాగానే చూసుకునేవాడు. అయితే కొన్నేళ్లు గడిచాక.. భార్యపై చిరాకు పడడం ప్రారంభించాడు. నువ్వు అందంగా లేవంటూ కసురుకునేవాడు. భర్త వేధింపులపై (Harassment) అత్తమామలకు చెప్పగా.. వారు కూడా కొడుక్కే మద్దతు పలికే వారు. అయినా ఆమె భరిస్తూ వచ్చింది. దీనికి తోడు వారికి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో ఇటీవల భర్త చికిత్స చేయించుకున్నాడు. పిల్లలు లేరనే కోపంతో భార్యపై మరింత చికాకు పడేవాడు.

వీడిని ఏమనాలి.. అలా శృంగారం చేయొద్దన్నందుకు బరితెగించి మరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత చూస్తే..

మరోవైపు అత్తమామలు కూడా వివిధ సాకులు చూపుతూ వేధించేవారు. నువ్వు అందంగా లేవంటూ మళ్లీ ఇటీవల భర్త గొడవ పెట్టుకున్నాడు. దీంతో తనకు మేకప్ (makeup), మంచి చీరల కోసం భార్య డబ్బులు అడిగింది. డబ్బులు ఇవ్వకపోగా భార్యపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓరోజు భర్త, అత్తమామలు.. ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. చివరకు ఆమె తన సమస్యను తల్లిదండ్రులకు చెప్పగా.. వారు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో చేసేదేమీ లేక చివరకు.. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

Updated Date - 2022-12-24T19:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising