మసాజర్ కోసం వెతుకుతుండగా.. ఆన్‌లైన్‌లో కనిపించిన భార్య ఫొటోలు.. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా...
ABN, First Publish Date - 2022-12-13T16:33:27+05:30
ఓ వ్యక్తి ఇటీవల మసాజర్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ సైట్‌లో తన భార్య, ఆమె సోదరి ఫొటోలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా అతను ఖంగుతిన్నాడు. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా..
ఆన్‌లైన్ మోసాలకు (Online scams) అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. లాటరీలో డబ్బు గెలుచుకున్నారంటూ కొందరు.. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మరికొందరు అమాయకుల నుంచి డబ్బులను దండుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అందమైన యువతులు, మహిళ ఫొటోలను (Women photos) వినియోగించి కూడా వివిధ మోసాలకు పాల్పడుతున్నారు. ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మసాజర్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా.. భార్య, ఆమె సోదరి ఫొటోలు కనిపించాయి. ఏంటా అని విచారించగా చివరకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
రెండో సారి శృంగారానికి సిద్ధపడ్డ భర్త.. అయితే భార్య సమాధానంతో చివరకు.. తమ్ముడి సాయం తీసుకుని మరీ..
ముంబైలోని (Mumbai) ఖార్ అనే ప్రాంతంలో ఉంటున్న ఓ వ్యక్తి ఇటీవల మసాజర్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ సైట్‌లో తన భార్య, ఆమె సోదరి ఫొటోలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా అతను ఖంగుతిన్నాడు. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా.. అవతలి నుంచి రేష్మా యాదవ్ అనే మహిళ మాట్లాడింది. మసాజ్ కోసం తాము చెప్పిన ప్రాంతానికి రావాలంటూ సూచించింది. తర్వాత సదరు వ్యక్తి ఇదే విషయాన్ని భార్య, ఆమె సోదరికి తెలియజేశాడు. అంతా కలిసి రేష్మా చెప్పిన హోటల్‌కి వెళ్లారు.
ఒకే కంపెనీలో ఉద్యోగం.. మూడేళ్లుగా ప్రేమ.. ఇటీవల యువకుడి పెళ్లి ఊరేగింపు జరుగుతుందనగా.. సడన్‌గా..
‘‘మా ఫొటోలను అసభ్యకరంగా మార్చి ఎందుకు ఇలా చేశారు’’.. అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రేష్మా యాదవ్.. వారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను పట్టుకుని చివరకు పోలీసులకు అప్పగించారు. గుర్తు తెలియని యువతులు, మహిళ ఫొటోలను తీసుకుని, ఇలాంటి తప్పుడు పనులకు వినియోగిస్తున్నారని విచారణలో తెలిసింది. రేష్మా యాదవ్ వెనుక కొందరు ముఠా సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-12-13T16:33:55+05:30 IST