ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో.. ఇది కారు డిక్కీనా..? మెడికల్ స్టోరా..? ప్రభుత్వాసుపత్రి ముందే కొత్త వ్యాపారం..!

ABN, First Publish Date - 2022-12-17T19:00:54+05:30

కొందరు వైద్యులు వృత్తే దైవంగా భావిస్తే.. మరికొందరు వైద్యులు అదే వృత్తి పేరుతో అక్రమ వ్యాపారం చేస్తుంటారు. మరికొందరైతే బయటికి ప్రభుత్వ వైద్యులుగా ఉంటూనే.. లోలోపల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు వైద్యులు వృత్తే దైవంగా భావిస్తే.. మరికొందరు వైద్యులు అదే వృత్తి పేరుతో అక్రమ వ్యాపారం చేస్తుంటారు. మరికొందరైతే బయటికి ప్రభుత్వ వైద్యులుగా ఉంటూనే.. లోలోపల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు మన చుట్టూ రోజూ జరుగుతూనే ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో కారు అనుమానాస్పదంగా ఉండడంతో ఓ మెడికల్ ఆఫీసర్ తనిఖీ చేశారు. కారు డిక్కీలో మెడికల్ స్టోర్‌ను తలపించేలా ఉన్న మందులను చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ప్లీజ్.. ఒక్క గంట ఆగండి.. పెళ్లయ్యాక నన్ను అరెస్ట్ చేసుకోండి.. పోలీసులను ఆ వరుడు వేడుకున్నా..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భింద్‌స్‌ ఫూప్‌ ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రిలో (Government Hospital) ఈ ఘటన చోటు చేసుకుంది. భింద్‌స్‌ ఫూప్‌ బీఎంఓ (Block Medical Officer) డాక్టర్ సిద్ధార్థ్ చౌహాన్.. ఇటీవల ఓ రోజు ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఓ కారు డిక్కీలో కొందరు ఏవో విక్రయిస్తున్నట్లు అధికారి కంటపడింది. దీంతో దగ్గరికి వెళ్లి పరిశీలించారు. కారు డిక్కీ మొత్తం మందులు నింపి, రోగులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అధికారిని చూసిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విచారణలో ఆస్పత్రిలో పని చేసే డాక్టర్ బీనా హోత్గి అనే మహిళా వైద్యురాలే ఈ అక్రమ వ్యాపారానికి (Illegal business) దిగినట్లు తేలింది. తన సొంత కారులో మందులను నింపుకొని అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

పెళ్లయిన మర్నాడే షాకింగ్ ఘటన.. పాడు పని చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. చివరకు..

వైద్యురాలు తన ఇంటి వద్ద సొంతంగా ప్రైవేట్ ఆస్పత్రి (Private hospital) నడుపుతున్నట్లు తెలిసింది. తన వద్దకు వచ్చే పేషంట్లతో పాటూ కొత్త వారికి కూడా మందులను విక్రయిస్తున్నట్లు బయటపడింది. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇటీవల ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్ మందులను విక్రయిస్తున్నట్లు రోగుల నుంచి పదే పదే ఫిర్యాదులు అందుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై సదరు వైద్యురాలిని ప్రశ్నించగా.. తన వద్దకు వచ్చే రోగికి మందులు అయిపోవడంతో బయట తెప్పించినట్లు చెప్పింది. మెడికల్ ఆఫీసర్ కావాలనే తనను టార్గెట్ చేసినట్లు ఆరోపించింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

దృశ్యం2 సినిమాను రెండు సార్లు చూసి.. ఇంటికొచ్చి య్యూటూబ్‌లో పరిశీలించి.. చివరకు ఈ వ్యక్తి చేసిన పని..

Updated Date - 2022-12-17T19:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising