చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు.. కాలితో నోరును నొక్కి.. కర్రలతో చితకబాది..
ABN, First Publish Date - 2022-11-30T15:51:54+05:30
చెడు అలవాట్లకు బానిసలైన వారు.. కొన్నిసార్లు సైకోళ్లా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో డబ్బుల కోసం దారుణాలకు తెగబడుతుంటారు. తమకు అడ్డు వచ్చిన వారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడరు. మధ్యప్రదేశ్‌లో..
చెడు అలవాట్లకు బానిసలైన వారు.. కొన్నిసార్లు సైకోళ్లా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో డబ్బుల కోసం దారుణాలకు తెగబడుతుంటారు. తమకు అడ్డు వచ్చిన వారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడరు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొందరు యువకులు.. ఓ విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించారు. చేతులు జోడించి వేడుకున్నా కనికరం చూపించలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రేవా పరిధి ఇటౌరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 12తరగతి విద్యార్థికి.. ఇదే ప్రాంతానికి చెందిన ఆశిష్ సింగ్, మరో ఇద్దరు యువకులతో ఇటీవల గొడవ జరిగింది. ఆశిష్ సింగ్, అతడి స్నేహితులు డ్రగ్స్‌కు (Drugs) బానిసలయ్యారు. చివరకు అవి తీసుకోకపోతే బతకలేని పరిస్థితికి వచ్చారు. ఈ క్రమంలో డబ్బులు తక్కువ అయిన సందర్భంలో ఎవరో ఒకరిని బెదిరించి తీసుకునేవారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని సదరు యువకులు డబ్బులు అడిగారు.
ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన మహిళలు.. జరిగింది తెలుసుకుని షాక్.. చివరకు డాక్టర్‌ని ప్రశ్నించగా..
నా వద్ద లేవు అని విద్యార్థి చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థిని తలకిందులుగా పట్టుకుని కర్రలతో దాడి (Attack) చేశారు. ఓ వ్యక్తి విద్యార్థి ముఖంపై కాలు పెట్టి నొక్కి పట్టుకోగా, మరో వ్యక్తి కర్ర తీసుకుని చితకబాదాడు. ‘‘మీ కాళ్లు పట్టుకుంటా.. దయచేసి నన్ను వదిలేయండి’’.. అని చేతులు జోడించి మరీ వేడుకున్న వారు మాత్రం కనికరించలేదు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, వాట్సప్ గ్రూపుల్లో (Whatsapp groups) షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ (viral videos) అవడంతో ఇటీవల వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఆశిష్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Updated Date - 2022-11-30T15:51:58+05:30 IST