ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Income Tax: కూలీకి షాకిచ్చిన ఐటీ శాఖ.. రూ.14 కోట్ల ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు..!

ABN, First Publish Date - 2022-12-21T15:51:07+05:30

అతనో దినసరి కూలి. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో పని చేసేవాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి.. ప్రస్తుతం ఇంటి వద్దే చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. అయితే ఇంటీవల..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతనో దినసరి కూలి. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో పని చేసేవాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి.. ప్రస్తుతం ఇంటి వద్దే చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. అయితే ఇంటీవల సదరు కూలీకి ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నేరుగా అతడి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు.. రూ.14కోట్ల ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు అందించారు. దీంతో ఒక్కసారిగా సదరు కూలీ షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగింటే..

మహిళతో వెనుకే గుడిలోకి వెళ్లిన యువకుడు.. అందరి ముందు ఒక్కసారిగా..

బీహార్‌లోని (Bihar) పాట్నా పరిధి రోహ్తాస్ జిల్లా కర్గహర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మనోజ్ యాదవ్ అనే కార్మికుడి ఇంటికి శనివారం కొందరు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు వచ్చారు. వారిని చూసి మనోజ్ యాదవ్.. ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అంతలో అతడి చేతిలో ఓ నోటీసు (Notices) పెట్టి.. మీరు రూ.14కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పారు. దీంతో మనోజ్‌కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. రోజు వారీ పనులు చేసుకుని జీవనం సాగించే అతడికి.. ఒక్కసారిగా రూ.14కోట్ల కట్టాలని అధికారులు చెప్పడంతో ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని.. తాను రోజు వారీ కూలీనని, ఆదాయపు పన్ను చెల్లించడం ఏంటని అధికారులను ప్రశ్నించాడు. అసలు విషయంలోకి వెళితే.. మనోజ్ గతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తదితర ప్రాంతాల్లోని వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పని చేసేవాడు. అయితే 2020 కొవిడ్ లాక్‌డౌన్ (covid lockdown) సమయంలో సొంతూరుకు వచ్చేశాడు.

రాత్రి వేళ భర్త ప్రియురాలి ఇంటికి.. పరాయి వ్యక్తితో కలిసి వెళ్లిన భార్య.. ఊహించని విధంగా..

అయితే ప్రైవేట్ కంపెనీలో (Private companies) పని చేస్తున్న సమయంలో కొందరికి తన ఆధార్ (Aadhaar), పాన్ కార్డు (PAN card) జిరాక్సు కాపీలను ఇచ్చాడు. వాటిని సదరు వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించుకున్నారని మనోజ్ వాపోయాడు. తన ఆస్తి మొత్తాన్ని పదింతలు లెక్కించినా అంత మొత్తం రాదని వాపోయాడు. తాను ఒక్క రూపాయి కూడా చెల్లించే పరిస్థితిలో లేనని చెప్పాడు. మనోజ్ ఇంటికి వెళ్లిన అధికారులు కూడా.. అతడి ఆర్థిక పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. అయితే ప్రధాన కార్యాలయం నుంచి నోటీసులు రావడంతో అందించేందుకు వచ్చినట్లు వివరించారు. కాగా, ఆదాయపు పన్ను శాఖ అధికారుల రాకతో భయపడిపోయిన మనోజ్.. సోమవారం నుంచి ఇంటికి తాళం వేసి, కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Amazing News: కొడుకు కావాలన్న ఆశతో మరోసారి గర్భందాల్చితే ఏకంగా..!

Updated Date - 2022-12-21T15:51:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising