ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన వ్యక్తి.. వెతుక్కుంటూ వెళ్లగా పార్కులో ప్రత్యక్షం.. జరిగిన విషయం తెలుసుకుని..

ABN, First Publish Date - 2022-12-23T19:45:15+05:30

ముక్కు పచ్చలారని చిన్న పిల్లలను కూడా శాడిస్టులు వదలడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఎప్పుడెప్పుడు అఘాయిత్యానికి పాల్పడదామా అని కాపు కాస్తూ ఉంటారు. ఇలాంటి దుర్మార్గులు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. ఢిల్లీలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముక్కు పచ్చలారని చిన్న పిల్లలను కూడా శాడిస్టులు వదలడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఎప్పుడెప్పుడు అఘాయిత్యానికి పాల్పడదామా అని కాపు కాస్తూ ఉంటారు. ఇలాంటి దుర్మార్గులు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. ఢిల్లీలో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. తమ పాప ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా కనిపించలేదు. అయితే మరసటి రోజు ఉదయం సమీపంలోని పార్కులో చూసి.. అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

Viral Video: నెమలిలో ఇంత ఆవేశాన్ని ఎప్పుడూ చూసుండరు.. గుడ్లను ఎత్తుకెళ్తున్న యువతిని ఏం చేసిందో చూడండి..

ఉత్తర ఢిల్లీలోని (Delhi) భల్స్వా డెయిరీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి ముందు బుధవారం సాయంత్రం ఓ ఐదేళ్ల చిన్నారి (five year old girl) ఆడుకుంటూ ఉంది. కాసేపటికి అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి.. చిన్నారిని ఎత్తుకుని వెళ్లాడు. సమీపంలోని పార్కులో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన అతను.. తర్వాత పాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తమ కూతురు ఎంతకీ ఇంటికీ రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలిక కనిపించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సినిమా స్టోరీని తలపించిన.. యువతి కిడ్నాప్‌ డ్రామా.. బర్త్‌ డే వేడుకలకు వెళ్లి ఆమె చేసిన పని..

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బాలికను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. ఉదయం సమీపంలోని పార్కులో ఉన్న బాలికను రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారిపై అఘాయిత్యం జరిగినట్లు వైద్యులు తెలిపారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

Updated Date - 2022-12-23T19:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising