ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ దొంగల తెలివి చూస్తే వామ్మో!.. అంటారు.. సొరంగం తవ్వి మరీ..‌ ఏకంగా రైలు ఇంజిన్‌నే..

ABN, First Publish Date - 2022-11-25T19:47:59+05:30

చోరీలు చేయడంలో కొందరు దొంగల తెలివి చూస్తే.. వామ్మో!.. వీళ్లెక్కడి దొంగలురా నాయనా.. అని అనిపిస్తుంటుంది. ఇప్పటి వరకూ ఇళ్లు, దుకాణాలు తదితరాలను టార్గెట్ చేసే దొంగలనే చూశాం. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోరీలు చేయడంలో కొందరు దొంగల తెలివి చూస్తే.. వామ్మో!.. వీళ్లెక్కడి దొంగలురా నాయనా.. అని అనిపిస్తుంటుంది. ఇప్పటి వరకూ ఇళ్లు, దుకాణాలు తదితరాలను టార్గెట్ చేసే దొంగలనే చూశాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగల తెలివి చూస్తే.. నిజంగా అంతా అవాక్కవుతారు. ఈ దొంగలు ఏకంగా రైలు ఇంజిన్‌నే ఎత్తుకెళ్లారు. ఈ చోరీని చూసి చివరకు పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. బీహార్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Viral Video: ఇదేం వింత.. చెప్పును తీసుకుని ఈ పాము ఏం చేస్తోందో మీరే చూడండి..!

బీహార్ (Bihar) పాట్నా పరిధిలో దొంగలు ఏకంగా రైలు ఇంజిన్లనే (Train engines) టార్గెట్ చేశారు. ఇందుకోసం వారు అధికారులే షాక్ అయ్యేలా.. సొరంగం తవ్వి మరీ చోరీకి (theft) పాల్పడ్డారు. గత వారం స్థానిక బరౌనీలోని గర్హరాయార్డ్‌లో ఓ రైలు ఇంజిన్‌ను మరమ్మతుల కోసం నిలిపి ఉంచారు. అయితే దొంగలు దీనిపై కన్నేశారు. ఇందుకోసం వారు బరౌని నుంచి ముజఫర్‌పూర్ వరకూ సొరంగం తవ్వారు. రైలు ఇంజిన్ భాగాలను తొలగించి మరీ ఎత్తుకెళ్లారు. దొంగల తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. చివరకు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం మొత్తం బయటపడింది.

ఏం ఐడియా గురూ.. ఈ వ్యక్తి కారునే దుకాణంగా మార్చడం వెనుక కథేంటో తెలిస్తే..!

చివరకు ముజఫర్‌పూర్‌లోని ప్రభాత్ కాలనీలో ఉన్న స్క్రాప్ గోడౌన్ నుంచి 13 బస్తాల ఇంజిన్ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంజిన్ ఉన్న యార్డ్ సమీపంలో పెద్ద సొరంగం బయటపడిందని చెప్పారు. ఇంజిన్ విడిభాగాలను గోనె సంచుల్లో వేసుకున తరలించినట్లు తేలిందన్నారు. గతంలో పూర్నియాలో ప్రదర్శన కోసం ఉంచిన పాల రైలు ఇంజిన్‌ను కూడా ఇలాగే చోరీ చేసినట్లు తెలిపారు. ఈ చోరీలో రైల్వే ఇంజినీర్ హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల, బీహార్‌లోని అరారియా జిల్లా సీతాధర్ నదిపై ఉన్న ఇనుప వంతెనను కూడా ధ్వంసం చేశారు. దీంతో అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఓ కానిస్టేబుల్‌ని కాపాలగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. వంతెన విడి భాగాలను ఎత్తుకెళ్లిన దొంగల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికి రైలు ఇంజిన్‌ను చోరీ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఫొటో తీయాలంటూ.. మహిళను ముఖం కడుక్కుని రమ్మన్న యువకులు.. కాసేపటికి..

Updated Date - 2022-11-25T19:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising