The world's most unlucky Groom: పాపం.. పెళ్లి రోజే అందరినీ కోల్పోయాడు.. కుటుంబంలో ముగ్గురే మిగిలారు..!

ABN, First Publish Date - 2022-12-28T20:00:56+05:30

దురదృష్టం వెంటాడుతున్నప్పుడు.. ఏ పని చేసినా చివరకు అందులో అపజయమే ఎదురవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే అనుకోని సంఘటనలు జరిగి చివరకు జీవితంలో విషాదం అలుముకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి విషయంలో..

The world's most unlucky Groom: పాపం.. పెళ్లి రోజే అందరినీ కోల్పోయాడు.. కుటుంబంలో ముగ్గురే మిగిలారు..!
ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దురదృష్టం వెంటాడుతున్నప్పుడు.. ఏ పని చేసినా చివరకు అందులో అపజయమే ఎదురవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే అనుకోని సంఘటనలు జరిగి చివరకు జీవితంలో విషాదం అలుముకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి విషయంలో చాలా దారుణం జరిగింది. పాపం.. పెళ్లి రోజే అతను తన వాళ్లందరినీ కోల్పోయాడు. కుటుంబంలో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పెళ్లయిన వారానికే షాకింగ్ ఘటన.. గుట్కాలు తిని ఇంట్లోనే ఊస్తోంది.. విడాకుల కోసం ఓ భర్త న్యాయ పోరాటం..!

రాజస్థాన్ (Rajasthan) జోధ్‌పూర్‌లోని షెర్‌ఘర్ పరిధి భుంగ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ అనే యువకుడి వివాహం (marriage) డిసెంబర్ 9న జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా 8న రాత్రి గ్రామానికి.. వరుడి బంధువులు, స్నేహితులు, సన్నిహితులంతా చేరుకున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రాత్రి వధూవరులకు ఊరేగింపు (Wedding procession) కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇంతలో ఊరేగింపు సమయం రానే వచ్చింది. వరుడు అందమైన దస్తులు ధరించి సిద్ధమయ్యాడు. ఊరేగింపు మొదలయ్యే లోపు విధి తన కుటుంబంపై చిన్న చూపు చూస్తుందని.. అతడికి అతడికి తెలీదు. కాసేపుంటే ఊరేగింపు జరుగుతుందనగా సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

crime-news.jpg

OYO Room: ప్రియుడిని కలిసిన వివాహిత.. బాత్రూంకు వెళ్లి 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన ప్రేయసికి గదిలో షాకింగ్ సీన్..!

వరుడి ఇంట్లో ఉన్న సుమారు ఐదు సిలిండర్లు ఒక్కసారిగా (cylinders Exploded) పేలిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 35మంది (Burning alive) సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో పది మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వరుడు ప్రస్తుతం స్పృహలోకి వచ్చాడు. చనిపోయిన వారిలో వరుడి తల్లిదండ్రులతో పాటూ మరో పది మంది దగ్గరి బంధువులు ఉన్నట్లు తెలిసింది. వరుడితో పాటూ అతడి అన్న, వదిన మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. స్పృహలోకి వచ్చిన వరుడికి ఇంత మంది చనిపోయారనే విషయం తెలీదు. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలవాలి.. అని చెప్పడం చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..

Updated Date - 2022-12-28T20:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising