ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న కొడుకు.. తల్లికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చాడో చూడండి..

ABN, First Publish Date - 2022-11-16T16:40:09+05:30

తల్లిదండ్రులను బాగా చూసుకునే కొడుకుల కంటే వేధించేవారే ఎక్కువగా ఉంటారు. ఆస్తి కోసం కొందరు, భార్య మాటలు విని ఇంకొందరు.. తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొందరు మాత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లిదండ్రులను బాగా చూసుకునే కొడుకుల కంటే వేధించేవారే ఎక్కువగా ఉంటారు. ఆస్తి కోసం కొందరు, భార్య మాటలు విని ఇంకొందరు.. తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొందరు మాత్రం తమ తల్లిదండ్రులను (parents) ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తల్లీకొడుకుల అనుబంధానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అలాటి వీడియో ఒకటి తెక్కర్లు కొడుతోంది. ఓ కొడుకు తల్లికి ఊహించిన సర్‌ప్రైజ్ ఇచ్చి.. నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాడు...

Viral Video: కొడుకు ఎదురుగా తల్లి స్టెప్పులు.. చివర్లో ఈ చిన్నోడు ఇచ్చిన రియాక్షన్ చూడండి..

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఓ కొడుకు తన తల్లిపై అభిమానాన్ని చూసి నెటిజన్లు (Netizens) ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ మహిళ తన కుటుంబ సభ్యులకు భోజనం వడ్డించే పనిలో ఉంటుంది. ఆ సమయంలో ఆమె కొడుకు సైలెంట్‌గా వెనుకే వచ్చి నిలబడి ఉంటాడు. సడన్‌గా ఓ బంగారు గొలుసును బయటికి తీసి తల్లి మెడలో వేస్తాడు. ఊహించని ఈ పరిణామానికి ఆమె భావేద్వేగానికి లోనవుతుంది. తర్వాత గొలుసును తడిమి చూసుకుంటూ మురిసిపోతుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇలాంటి తల్లీకొడుకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు అని కొందరు, ప్రతి తల్లికీ ఇలాంటి కొడుకు ఉండాలి అంటూ మరికొందరు, ఈ కొడుకును దేవుడు ఆశీర్వదిస్తాడు.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: కడుపులో ఏదో కదులుతోందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చివరకు నోటి ద్వారా పరిశీలించి బయటికి తీయగా..

Updated Date - 2022-11-16T16:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising