ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయిన వారానికే షాకింగ్ ఘటన.. గుట్కాలు తిని ఇంట్లోనే ఊస్తోంది.. విడాకుల కోసం ఓ భర్త న్యాయ పోరాటం..!

ABN, First Publish Date - 2022-12-27T18:53:12+05:30

వివాహమైన కొత్తలో దంపతుల మధ్య ఉండే ప్రేమానురాగాలు... కొన్నిసార్లు క్రమంగా తగ్గుతూ వస్తుంటాయి. వివిధ సమస్యల కారణంగా కొన్నిసార్లు అవి తీవ్రరూపం దాల్చి చివరకు విడాకుల వరకూ దారి తీస్తుంటాయి. అయితే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహమైన కొత్తలో దంపతుల మధ్య ఉండే ప్రేమానురాగాలు... కొన్నిసార్లు క్రమంగా తగ్గుతూ వస్తుంటాయి. వివిధ సమస్యల కారణంగా కొన్నిసార్లు అవి తీవ్రరూపం దాల్చి చివరకు విడాకుల వరకూ దారి తీస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన వారానికే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన భార్య గుట్కాలు తిని ఇంట్లోనే ఊస్తోందని, తనకు విడాకులు మంజూరు చేయాలని న్యాయ పోరాటం చేశాడు. వివరాల్లోకి వెళితే..

పరాయి వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పిన భార్య.. ఫోన్‌లో అసభ్యకర ఫొటోలు చూసిన భర్త.. ఎవరికీ చెప్పకుండా..

ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బంకి గ్రామానికి చెందిన ఉదయ్ అనే వ్యక్తికి కత్ఘోరాకు చెందిన యువతితో 2015 మే 19న (marriage) వివాహమైంది. సాధారణంగా వివాహమైన కొత్తలో దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ ఈ వ్యక్తి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. పెళ్లి తర్వాత వారానికే.. భార్య రూపంలో భర్తకు సమస్య వచ్చి పడింది. వారం రోజుల తర్వాత ఓ రోజు రాత్రి సమయంలో భార్య.. మంచంపై స్పృహ తప్పి పడిపోయింది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉండడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు.. ఆమె మత్తు పదార్థాలకు బానిసగా (Addicted to drugs) మారిందని గుర్తించారు. ఈ విషయం తెలుసుకుని.. ఆమె భర్తతో పాటూ కుటుంబ సభ్యులు మొత్తం షాక్ అయ్యారు.

Viral Video: తాళం తీసి ఉన్నా సరే.. ఈ ఇంట్లోకి వెళ్లే ధైర్యం ఎవరూ చేయరేమో..!

కొన్ని రోజులు పోతే భార్య ప్రవర్తనలో మార్పు వస్తుందని భావించాడు. కానీ ఆమె ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. కొన్నిసార్లు విసుగొచ్చి గట్టిగా వాదించడంతో భార్య ఆత్మహత్యాయత్నం (suicide attempt) చేసింది. ఇలా భర్త ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడల్లా ఆత్మహత్యాయత్నం చేస్తూ.. కుటుంబ సభ్యులను బెదిరించేది. దీంతో చివరకు విసిగిపోయిన భర్త.. ఫ్యామిలీ కోర్టులో విడాకుల (Divorce) కోసం అభ్యర్థించాడు. అయితే ఇక్కడ అతడి పిటిషన్‌ తిరస్కరించబడింది. చివరకు ఛత్తీస్‪‌గఢ్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య తరచూ గుట్కా నములుతూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తోందని, అలాగే తరచూ మద్యం కూడా తీసుకుంటోందని చెప్పాడు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. భార్య ప్రవర్తన క్రూరత్వంగా ఉందని తేల్చింది. ఇలాంటి సందర్భాల్లో భర్తకు విడాకులు మంజూరు చేయడం సమంజసమని పేర్కొంది.

Whatsapp Alert: డిసెంబర్ 31 తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు..!

Updated Date - 2022-12-27T18:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising