భర్తను చంపి.. మృతదేహం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భార్య.. నాన్నను లేపొద్దంటూ పిల్లలకు చెప్పి..
ABN, First Publish Date - 2022-12-20T17:57:32+05:30
భర్తలు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కొందరు మహిళలు సహనంతో భరిస్తుంటారు. ఎప్పటికైనా తప్పు తెలుసుకుంటాడులే.. అనుకుని సర్దుకుపోతుంటారు. అయితే మరికొందరు మహిళలు మాత్రం..
భర్తలు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కొందరు మహిళలు సహనంతో భరిస్తుంటారు. ఎప్పటికైనా తప్పు తెలుసుకుంటాడులే.. అనుకుని సర్దుకుపోతుంటారు. అయితే మరికొందరు మహిళలు మాత్రం.. వేధింపులు భరించలేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. మద్యానికి అలవాటు పడి, రోజూ వేధిస్తుండడంతో సహనం కోల్పోయి హత్య చేసింది. మృతదేహం పక్కనే రాత్రంతా నిద్రపోయింది. నాన్నను లేపొద్దంటూ.. పిల్లలకు చెప్పి చివరకు ఏం చేసిందంటే..
అర్ధరాత్రి పహారా కాస్తున్న జవాను.. రోడ్డు పక్కన పడుకున్న వారిని పరిశీలించి.. చివరకు..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాయ్‌బరేలీలోని బచ్రావాన్ పరిధి సాగో పశ్చిమ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతుల్ అనే వ్యక్తి.. భార్య అన్నూతో కలిసి నివాసం ఉంటున్నాడు. అన్నూ.. స్థానికంగా బ్యూటీపార్లర్ (Beauty parlour) నడుపుతూ ఉండేది. వివాహమైన మొదట్లో సక్రమంగా ఉన్న అతుల్.. రాను రాను మద్యానికి (Addiction to alcohol) బానిసయ్యాడు. దీంతో పాటూ రోజూ తాగొచ్చి భార్యను వివిధ సాకులూ చూపుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా మారతాడులే అనుకుని ఆమె భరిస్తూ వచ్చింది. కానీ అతడి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. వేధింపులు రోజు రోజుకూ ఎక్కువ అవుతుండడంతో చివరకు ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఈ క్రమంలో డిసెంబర్ 15న అర్ధరాత్రి అతుల్.. ఫుల్‌గా మందు తాగి వచ్చాడు. వచ్చీ రాగానే భార్యతో గొడవపడ్డాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆమె.. పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో (Attack with an iron rod) భర్త తలపై బలంగా కొట్టింది.
కలెక్టరేట్‌కు చేరిన ఎలుకల పంచాయితీ.. ఇరువర్గాల ఆరోపణలు విని షాకైన పోలీసులు..
దీంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తర్వాత గొంతు నులిమి హత్య చేసింది. ఉదయం పిల్లలతో ‘‘ మీ నాన్న పడుకుని ఉన్నాడు.. నిద్ర లేపొద్దు’’ అని చెప్పి బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి వంట చేసి, పిల్లలతో పాటూ భోజనం కూడా చేసింది. పిల్లలు నిద్రపోయాక.. భర్త మృతదేహాన్ని ఊరి బయటకు తీసకెళ్లి పడేసింది. అతిగా మద్యం సేవించడం వల్లే తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. పోలీసులు కూడా ఇలాగే కేసు నమోదు చేసుకున్నారు. అయితే దంపతుల మధ్య జరిగిన గొడవ విషయం తెలుసుకున్న పోలీసులకు అనుమానం వచ్చింది. చివరకు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-12-20T17:58:27+05:30 IST