రాత్రి వేళ భర్త ప్రియురాలి ఇంటికి.. పరాయి వ్యక్తితో కలిసి వెళ్లిన భార్య.. చివరకు....
ABN, First Publish Date - 2022-12-20T20:41:56+05:30
కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఓ వ్యక్తి భార్యను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి.. పరాయి మహిళపై ఆశపడ్డాడు. భార్యకు తెలీకుండా ప్రియురాలితో కలిసి తిరుగుతుండేవాడు. ప్రస్తుతం కొన్నేళ్లుగా..
కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఓ వ్యక్తి భార్యను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి.. పరాయి మహిళపై ఆశపడ్డాడు. భార్యకు తెలీకుండా ప్రియురాలితో కలిసి తిరుగుతుండేవాడు. ప్రస్తుతం కొన్నేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ రోజు భర్త తన ప్రియురాలు ఇంట్లో నిద్రిస్తుండగా.. మరో యువకుడితో కలిసి అక్కడికి వెళ్లింది. చివరకు ఆమె చేసిన పని తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని (Telangana) మంచిర్యాల జిల్లా (Telangana Mancheryala District) ఉత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగారపు శాంతయ్య.. అందరూ ఉండి అనాథగా విగత జీవుడయ్యాడు. సింగరేణిలో (Singareni) ఉద్యోగం చేస్తున్న శాంతయ్యకు భార్య సృజన, ఇద్దరు కుమారులు, ఓ కూతురుతో పాటూ సోదరులు ఉన్నారు. గుడిపల్లి ఘటనలో శాంతయ్య మృతిచెందాడు. శాంతయ్య మరణించి నాలుగు రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు రాలేదు. మున్సిపల్ సిబ్బంది సాయంతో శాంతయ్యకు స్నేహితులు అంత్యక్రియలు (funeral) చేశారు. సింగరేణిలో ఉద్యోగంతో కలిపి శాంతయ్యకు సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తిపాస్తులున్నట్లు తెలుస్తోంది. లక్షెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగారపు శాంతయ్య లక్ష్యంగా జరిగిన దహనకాండకు సంబంధించి ఆయన భార్య సృజన, ఆమె ప్రియుడే అసలు సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసులో భార్య సృజనను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. శాంతయ్యకు గుడిపెల్లిలోని మాసు పద్మతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం (extramarital affair) ఉండగా.. ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. శాంతయ్య మరో రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయనుండడంతో ఆ ఉద్యోగం తమకు దక్కదేమోననే భావనతో ఈ హత్యోదంతానికి రూపకల్పన జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో గొడవ జరిగి ఇప్పటికే శాంతయ్యపై రెండుసార్లు హత్యాయత్నం జరగగా త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి శాంతయ్య .. పద్మ ఇంటి వద్దే ఉంటున్నాడు. శాంతయ్యకు ఉత్కూరు సమీపంలో స్థలం ఉండగా భార్య సృజన ఇటీవల దానిని ఇద్దరు కుమారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది.
భర్తను చంపి.. మృతదేహం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భార్య.. నాన్నను లేపొద్దంటూ పిల్లలకు చెప్పి..
ఉద్యోగాన్ని కూడా దక్కించుకునే క్రమంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన మేడి లక్ష్మణ్‌ను ఆశ్రయించింది. శాంతయ్యను హతమార్చితే ఉద్యోగం, ఇతర లావాదేవీలు తమకే వర్తిస్తాయనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి గుడిపెల్లికి చేరుకొని శివయ్య-పద్మ దంపతుల ఇంటికి బయట నుంచి తలుపు గొళ్లెం పెట్టి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటనపై శాంతయ్య భార్య సృజనను అనుమానించిన పోలీసులు.. ఆమె పాత్రపై ఆరా తీయగా అసలు ముఠా సభ్యులు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఈ కేసులో అనుమానితులు మేడి లక్ష్మణ్, సారయ్య, రమేష్, మల్లయ్యలను పోలీసులు విచారిస్తున్నారు.
Updated Date - 2022-12-20T21:08:19+05:30 IST