ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహితకు ఫోన్‌లో పరిచయమైన యువకుడు.. ఎంత ప్రయత్నించినా ఆమె అంగీకరించకపోవడంతో.. ఆస్పత్రికి ఫోన్ చేసి..

ABN, First Publish Date - 2022-12-06T15:37:34+05:30

ముక్కు, మొఖం తెలియకుండా ఏర్పడే స్నేహాల వల్ల కొన్నిసార్లు లేనిపోని సమస్యలు వచ్చిపడుతుంటాయి. మహిళలకు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముక్కు, మొఖం తెలియకుండా ఏర్పడే స్నేహాల వల్ల కొన్నిసార్లు లేనిపోని సమస్యలు వచ్చిపడుతుంటాయి. మహిళలకు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల ఆమెకు ఓ యువకుడితో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. నువ్వంటే ఇష్టం అంటూ పదే పదే ఫోన్ చేసినా ఆమె అంగీకరించలేదు. దీంతో చివరకు ఆస్పత్రికి ఫోన్ చేసిన యువకుడు.. ఏం చేశాడంటే..

Viral Video: యువతిని కలిసేందుకు వెనుక నుంచి బాల్కనీ ఎక్కిన యువకులు.. పైకి వెళ్లగానే ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్ఫూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళకు (woman) భర్త, ఓ కొడుకు ఉన్నాడు. అత్తమామలతో కలిసి ఉంటున్నారు. ఇదిలావుండగా, రెండు నెలల క్రితం ఆమెకు రజత్ మిశ్రా అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. నువ్వంటే ఇష్టం.. అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. పోన్ కట్ చేస్తున్నా పదే పదే చేస్తుండడంతో గట్టిగా మందలించింది. దీంతో అప్పటి నుంచి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఏదో రకంగా ఆమెను వేధించాలనే ఉద్దేశంతో ఇటీవల చిత్రవిచిత్రమైన పనులు చేయడం మొదలెట్టాడు.

మామ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పడంతో.. నిద్రమాత్రలు ఇచ్చిన తండ్రి.. పొద్దున లేచిన కూతుళ్లు షాక్..

ముందుగా ఓ రోజు ఆస్పత్రికి (Hospital) ఫోన్ చేసి.. ‘‘ ఓ గర్భిణికి పురటినొప్పులు వచ్చాయని, అర్జంట్‌గా అంబులెన్స్ (Ambulance) పంపమని.. సదరు మహిళ అడ్రస్ ఇచ్చాడు. తీరా అక్కడికి వెళ్లిన ఆస్పత్రి సిబ్బంది.. అబద్ధం చెప్పాడని తెలుసుకున్నారు. అయితే తప్పు తెలుసుకుంటాడులే అనుకుని.. ఆమె మొదటగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల మళ్లీ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, మహిళ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. ఎలాంటి ఆత్మహత్య (suicide) జరగలేదని తెలిసి.. యువకుడి నంబర్‌కు కాల్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. చివరకు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. యువకుడికి కోసం గాలిస్తున్నారు.

ఆ పని చేయాలంటూ కూతురిపై తల్లి ఒత్తిడి.. వీడియోలను బయటపెట్టిన యువతి చివరకు ఏం చేసిందంటే..

Updated Date - 2022-12-06T15:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising