Viral Video: కడుపులో ఏదో కదులుతోందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చివరకు నోటి ద్వారా పరిశీలించి బయటికి తీయగా..
ABN, First Publish Date - 2022-11-15T18:29:09+05:30
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ (Viral videos) అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు చూస్తే.. ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంటుంది. అలాగే కొన్ని వివిధ సమస్యలతో కొందరు ఆస్పత్రులకు వెళ్తుంటారు. కానీ పరీక్షల తర్వాత కొన్నిసార్లు..
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ (Viral videos) అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు చూస్తే.. ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంటుంది. అలాగే కొన్ని వివిధ సమస్యలతో కొందరు ఆస్పత్రులకు వెళ్తుంటారు. కానీ పరీక్షల తర్వాత కొన్నిసార్లు.. వైద్యులే షాక్ అయ్యే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కడుపులో ఏదో కదులుతోందని ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. అయితే పరీక్షించిన వైద్యులు.. చివరకు ఇదెలా సాధ్యమంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...
వంట గదిలో భోజనం చేస్తున్న భర్త.. మంటల్లో చిక్కుకోవడంతో.. అక్కడే ఉన్న భార్య చివరకు షాకింగ్ నిర్ణయం..
రష్యాకు చెందిన ఓ మహిళ (Russian woman) ఇటీవల గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కడుపు నొప్పి మొదలైంది. అంతలోనే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి.. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చివరకు ఆమె కడుపులో నాలుగు అడుగుల పాము ఉండడాన్ని (Snake in stomach) చూసి షాక్ అయ్యారు. ఇదెలా సాధ్యం అనుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు ఆమె నోటి ద్వారా.. ఆ పామును అతికష్టం మీద బయటకు తీశారు. అయితే బయటికి తీసిన తర్వాత కూడా ఆ పాము సజీవంగా ఉండడం చూసి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు షాక్‌తో కూడిన ఎమోజీలు పెడుతుంటే.. మరికొందరు వామ్మో! ఇదెక్కడి చోద్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి..
Viral Video: వామ్మో! ఇలాంటి అనుభవం మీకూ ఎదురైందా.. నీళ్ల కోసం ఫ్రిజ్ వద్దకు వెళ్లగా షాకింగ్ సీన్..
Updated Date - 2022-11-15T18:29:21+05:30 IST