ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పింది కాకుండా మరో బ్రాండ్ సర్ఫ్‌ను కొని తెచ్చాడట.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిందో భార్య..

ABN, First Publish Date - 2022-12-02T20:23:57+05:30

పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లకు రోజూ వందలాది కాల్స్ వస్తుంటాయి. వాటిలో భూవివాదాలు, భార్యాభర్తల గొడవలు, ఆత్మహత్యలు తదితరాలకు సంబంధించిన కేసులు ఉంటాయి. అయితే అప్పుడప్పుడూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లకు రోజూ వందలాది కాల్స్ వస్తుంటాయి. వాటిలో భూవివాదాలు, భార్యాభర్తల గొడవలు, ఆత్మహత్యలు తదితరాలకు సంబంధించిన కేసులు ఉంటాయి. అయితే అప్పుడప్పుడూ పోలీసులకు కొన్ని ఫేక్ కాల్స్ కూడా వస్తుంటాయి. అలాగే మరి కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా వస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పోలీసులకు తాజాగా.. ఓ విచిత్రమైన ఫిర్యాదు వచ్చింది. చెప్పింది కాకుండా మరో బ్రాండ్ సర్ఫ్‌ను కొని తెచ్చాడని భార్య గొడవకు దిగింది. దీనిపై ఏకంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..

Revange Plan: సమాజం ఎటుపోతోంది.. ఓ 15 ఏళ్ల పిల్లాడు చేయాల్సిన పనులేనా ఇవి..!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్‌పూర్ పోలీసులకు డయల్-112కు (Dial-112) వింత సమస్యకు సంబంధించిన ఫిర్యాదు వచ్చింది. నవంబర్ 23న స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ 112కు కాల్ చేసింది. తాను ఆర్డర్ చేసిన సర్ఫ్ కాకుండా వేరే బ్రాండ్‌కు చెందిన సర్ఫ్‌ను తెచ్చాడని ఆరోపించింది. ఈ సమస్య వినగానే పోలీసులు ఖంగుతిన్నారు. దీనిపై పూర్తి వివరాలు కనుక్కునేందుకు సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లారు. వేరే బ్రాండ్ సర్ఫ్ తేవడంలో కూడా చాలా ఆలస్యం చేశాడనే విషయంలో భర్తతో సదరు మహిళ గొడవకు దిగింది. దీంతో వారికి ఎలా సర్దిచెప్పాలో తెలీక పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు ఈ కేసు మహిళా పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. సర్ఫ్ విషయంలో తలెత్తిన గొడవ.. చివరకు భార్యాభర్తలూ విడిపోయే వరకూ వచ్చింది.

ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు బోగీ.. సడన్‌గా కిటికీ వైపు నుంచి దూసుకొచ్చిన మృత్యువు..

పోలీసులకు చివరకు వారికి ఎలాగోలా కౌన్సెలింగ్ (Police Counselling) ఇచ్చి పంపించారు. ఇలాంటి విచిత్రమైన కేసులు గతంలో కూడా చాలా వచ్చాయి. నవంబర్ 13న ఓ యువకుడు 112కు కాల్ చేసి, తనకు పెళ్లి కావడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో అవాక్కయిన పోలీసులు.. చివరకు సదరు యువకుడికి కూడా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. భూవివాదాలు, ఆత్మహత్యలు తదితరాలకు సంబంధించిన కేసులతో పాటూ ఇలాంటి వింత ఫిర్యాదులు కూడా చాలా వస్తుంటాయని, అయితే తమ సిబ్బంది సకాలంలో స్పందించి చాలా కేసులను పరిష్కరించారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

పదేళ్ల పిల్లాడికి ఏడాది నుంచి విపరీతమైన కడుపునొప్పి.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూస్తే కడుపులో 100 గ్రాముల పరిమాణంలో..

Updated Date - 2022-12-02T20:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising