Viral Video: వీడియో తీసుకోవడానికి విద్యుత్ స్తంభం ఎక్కాడు.. కాసేపటి తర్వాత అతడి పరిస్థితి..
ABN, First Publish Date - 2022-12-27T16:09:43+05:30
ప్రస్తుత యువత సెల్ఫీల మోజులో పడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా.. వ్యూస్, లైకుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకునే క్రమంలో..
ప్రస్తుత యువత సెల్ఫీల మోజులో పడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా.. వ్యూస్, లైకుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకునే క్రమంలో ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం గతంలో చాలా చూశాం. అయినా చాలా మంది యువతలో మార్పు రావడం లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. వీడియో తీసుకునేందుకు ఏకంగా రైల్వే ట్రాక్ పక్కన ఉన్న స్తంభాన్ని ఎక్కడో యువకుడు. అయితే అనూహ్య ఘటన చోటు చేసుకోవడంతో కాసేపటికి అతడి పరిస్థితి విషమంగా మారింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు వీడియోలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా రైల్వే ట్రాక్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని (Electric pole) ఎక్కాడు. పైకి ఎక్కాక వీడియో తీసుకునే క్రమంలో హైటెన్షన్ వైర్లను తాకడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి (Electric shock) గురయ్యాడు. దీంతో సడన్‌గా పైనుంచి కిందపడ్డాడు. అప్పటికే ఒళ్లంతా కాలిపోయి, పొగలు కక్కుతూ కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. పక్కన ఉన్న వారు ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ అవడంతో ఉన్నతాధికారుల (Railway officials) దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనపై విచారణ చేయాలని నార్త్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర పనులు చేయొద్దంటూ సూచిస్తున్నారు.
Viral Video: తాళం తీసి ఉన్నా సరే.. ఈ ఇంట్లోకి వెళ్లే ధైర్యం ఎవరూ చేయరేమో..!
Updated Date - 2022-12-27T16:09:57+05:30 IST