ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడికి వెళ్లిన తండ్రీకూతుళ్లు.. తిరిగి వస్తుండగా సడన్‌గా కూతురు కిడ్నాప్.. మధ్యాహ్నం తండ్రికి ఫోన్ చేసిన యువతి..

ABN, First Publish Date - 2022-12-20T19:27:47+05:30

సినిమా తరహా ఘటనలు నిజ జీవితంలోనూ జరగడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనలు ప్రేమికుల విషయంలో ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ ప్రేమ జంట విషయంలో ఇలాగే జరిగింది. గుడికి వెళ్లిన తండ్రీకూతుళ్లు తిరిగి వస్తుండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా తరహా ఘటనలు నిజ జీవితంలోనూ జరగడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనలు ప్రేమికుల విషయంలో ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ ప్రేమ జంట విషయంలో ఇలాగే జరిగింది. గుడికి వెళ్లిన తండ్రీకూతుళ్లు తిరిగి వస్తుండగా.. సడన్‪‌గా కూతురు కిడ్నాప్‌కు గురైంది. దీంతో అంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు. అయితే అదే రోజు మధ్యాహ్నం తండ్రికి ఫోన్ చేసిన కూతురు చివరకు ఏం చెప్పిందంటే..

Amazing News: అప్పటికే ముగ్గురు కూతుళ్లు.. కొడుకు కావాలన్న ఆశతో మరోసారి గర్భందాల్చితే ఏకంగా ముగ్గురు..!

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla District) చందుర్తి మండలం మూడపల్లిలో మంగళవారం తెల్లవారుజామున యువతి కిడ్నాప్‌ (young woman Kidnapping) కలకలం రేపింది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకున్నానని ఆ యువతి మధ్యాహ్నం సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేయడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే... రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య తన కూతురు షాలినితో మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో పూజల కోసం వెళ్లారు. పూజల అనంతరం గుడి నుంచి బయటకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన జ్ఞానేందర్‌ అలియాస్‌ జానీ అనే యువకుడితో పాటూ మరో ముగ్గురు యువకులు కలిసి యువతిని కిడ్నాప్‌ చేశారు.

భర్తను చంపి.. మృతదేహం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భార్య.. నాన్నను లేపొద్దంటూ పిల్లలకు చెప్పి..

ప్రతిఘటించిన యువతి తండ్రిని యువకులు నెట్టేసి కారులో పరారయ్యారు. మధ్నాహం షాలిని తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను (Social media videos) విడుదల చేసింది. జానీని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పింది. తాము ఇష్టపూర్వకంగానే ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు ఇతర సంబంధాలు చూస్తున్నారని, తనను తీసుకెళ్లాలని జానికి ఫోన్‌ చేసినట్లు పేర్కొంది. తనను తీసుకెళ్లే సమయంలో మాస్కు ధరించి ఉండడంతో జానీని గుర్తు పట్టలేదని, గుర్తు పట్టిన తరువాత మంగళవారం ఇష్టపూర్వకంగా వెళ్లి కొండగట్టులో పెళ్లి (marriage) చేసుకున్నామని చెప్పింది. గతంలో పెళ్లి చేసుకున్నా మైనర్లు కావడం వల్ల వివాహం చెల్లలేదని తన తల్లిదండ్రులు అతడిపై కేసు పెట్టారని తెలిపింది. ఇద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. కిడ్నాప్‌ కథ పెళ్లితో సుఖాంతమైంది.

కలెక్టరేట్‌కు చేరిన ఎలుకల పంచాయితీ.. ఇరువర్గాల ఆరోపణలు విని షాకైన పోలీసులు..

సంవత్సరం క్రితం షాలినీ, జానీ ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నారు. అప్పుడు మైనర్‌ కావడంతో జానీపై షాలినీ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల షాలినీకి మైనారిటీ తీరడంతో తల్లిదండ్రులు మరో అబ్బాయితో ఈ నెల 19న నిశ్చితార్థం (Engagement) నిర్వహించారు. కాగా, కిడ్నాప్‌ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో (CC cameras) రికార్డు అయిన దృశ్యాలు.. సోషల్‌ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. కిడ్నాప్‌పై తండ్రి చంద్రయ్య చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఈ సంఘటనపై సీరియస్‌ అయ్యారు. ఎస్పీ రాహుల్‌ హెగ్డేను పిలిపించుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడపల్లి యువతి కిడ్నాప్‌ నిందితులను సాయంత్రం లోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దృరదృష్టకరమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరినీ ఉపేక్షించవద్దని పేర్కొన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తున్న భార్య.. అనుమానం పెంచుకున్న భర్త.. ఓ రోజు అర్ధరాత్రి..

Updated Date - 2022-12-20T19:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising