BCCI: భారత్‌లో పర్యటించనున్న ఆసీస్, కివీస్, శ్రీలంక.. తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ గుడ్‌న్యూస్
ABN, First Publish Date - 2022-12-08T21:09:52+05:30
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి నుంచి మార్చి
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి నుంచి మార్చి వరకు స్వదేశంలో భారత జట్టు బిజీబిజీగా గడపడనుంది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌తో వన్డేకు హైదరాబాద్ (Hyderabad) ఆతిథ్యం ఇవ్వనుండగా, ఆస్ట్రేలియాతో వన్డేకు విశాఖపట్టణం (Vizag) వేదిక కానుంది. జనవరిలో శ్రీలంక పర్యటనతో హోం సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 3న భారత్-శ్రీలంక మధ్య ముంబైలో తొలి 20 జరుగుతుంది. అదే నెల 15న తిరువనంతపురంలో జరిగే మూడే వన్డేతో సిరీస్ ముగుస్తుంది. పూణె, రాజ్‌కోట్, గువాహటి, కోల్‌కతాలలో మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆ తర్వాత హైదరాబాద్‌లో జనవరి 18న జరగనున్న తొలి వన్డేతో న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం అవుతుంది. రాయ్‌పూర్, ఇండోర్‌లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. రాయ్‌పూర్ తొలిసారి ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 21న రెండో వన్డే ఈ వేదికపై జరుగుతుంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు మూడు టీ20లు జరుగుతాయి. రాంచీ, లక్నో, అహ్మదాబాద్‌లలో ఇవి జరుగుతాయి.
ఆ తర్వాత ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది. నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 9న ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఆసీస్ పర్యటన ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మూడు టెస్టులు వరుసగా ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌లలో జరుగుతాయి. ఆ తర్వాత ముంబై, వైజాగ్, చెన్నై వేదికగా జరిగే మూడు వన్డేలతో హోం సిరీస్ ముగుస్తుంది.
Updated Date - 2022-12-08T21:09:54+05:30 IST