Bangladesh vs India: పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్.. బౌలర్ల దెబ్బకు ఢమాల్!
ABN, First Publish Date - 2022-12-15T16:02:31+05:30
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటింగ్
చాటోగ్రామ్: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ (Bangladesh) బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. భారత (Team India) బౌలర్లు సంధించే పదునైన బంతులను ఎదుర్కోలేక వచ్చిన వారు వచ్చినట్టే వెనుదిరుగుతున్నారు. ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఆ తర్వాత కూడా కుదురుకులేకపోయింది. వడివడిగా వికెట్లు కోల్పోతూ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.
ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేసిన బంగ్లాదేశ్.. భారత్ కంటే 302 పరుగులు వెనకబడి ఉంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ చేసిన 28 పరుగులకే అత్యధికమంటే వారి బ్యాటింగ్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) 4 వికెట్లు పడగొట్టగా, మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను గుక్కతిప్పుకోనివ్వకుండా చేశాడు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయింది.
Updated Date - 2022-12-15T16:07:11+05:30 IST