ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20 World Cup: శ్రీలంకను కట్టడి చేసిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా భవితవ్యమేంటో?

ABN, First Publish Date - 2022-11-05T15:22:30+05:30

టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) బౌలర్లు రాణించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) బౌలర్లు రాణించారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka)ను 141 పరుగులకు కట్టడి చేసి గెలుపు బాధ్యతను బ్యాటర్లపైకి నెట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 84 పరుగులతో పటిష్ఠ స్థితిలోనే ఉన్నట్టు కనిపించిన శ్రీలంకకు ఆ తర్వాత వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.

క్రీజులో పాతుకుపోయి ప్రమాదకరంగా మారిన ఓపెనర్ పాథుమ్ నిశ్శంకను అదిల్ రషీద్ పెవిలియన్ పంపడంతో శ్రీలంక వికెట్ల పతనం ప్రారంభమైంది. నిశ్శంక 45 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన శ్రీలంకకు పరుగులు రావడం కష్టమైంది. దీంతో అప్పటి వరకు పటిష్ఠంగా కనిపించిన జట్టు ఆ తర్వాత ఒక్కసారిగా కష్టాల్లో పడిపోయింది. దీనికి తోడు ఇంగ్లిష్ బౌలర్లు మరింత ఒత్తిడి పెంచడంతో ఒక్క పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయి 141 పరుగులకు పరిమితమైంది. నిశ్శంక తర్వాత భానుక రాజపక్స చేసిన 22 పరుగులే అత్యధికం. కుశాల్ మెండిస్ 18 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కనుక విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు చేరుతుంది. ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా ఇంటిదారి పడుతుంది.

Updated Date - 2022-11-05T15:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising