ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: టీఆర్ఎస్‌కు దమ్ముంటే మా సవాల్‌ను స్వీకరించి.. 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

ABN, First Publish Date - 2022-11-06T20:02:25+05:30

మునుగోడు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఓడిపోతే కుంగిపోము.. గెలిస్తే పొంగిపోమమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Bandi Sanjay, bjp mp
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మునుగోడు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఓడిపోతే కుంగిపోము.. గెలిస్తే పొంగిపోమమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కమిట్‌మెంట్‌తో బీజేపీ పనిచేసిందని, టీఆర్ఎస్‌ బెదిరింపులకు తలొగ్గకుండా తమ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి యుద్ధం చేశారని, టీఆర్ఎస్‌ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను 15 రోజుల్లోగా అమలు చేయాలని సంజయ్‌ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించి.. ఉపఎన్నికలకు రావాలని సంజయ్‌ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా స్వల్ప మెజార్టీనే వచ్చిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేసినా 10 వేల మెజార్టీనే వచ్చిందని సంజయ్‌ మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో బీజేపీ లేదన్నారని, మునుగోడు ఫలితం బీజేపీ బలమేంటో చూపించిందని సంజయ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-06T20:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising