Auro Manthan: ఆకట్టుకున్న ఆరో మంతన్
ABN , First Publish Date - 2022-12-12T19:08:45+05:30 IST
మూడు రోజుల వేడుకల్లో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, రచయిత ప్రశాంత్ పోలె పాల్గొన్నారు.

హైదరాబాద్: శ్రీ అరబిందో (Sri Aurobindo) 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ (Sri Aurobindo International School) లో ఎగ్జిబిషన్ ముగిసింది. ఆరో మంతన్ (Auro Manthan) పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 10న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావు ప్రారంభించారు. మూడు రోజుల వేడుకల్లో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, రచయిత ప్రశాంత్ పోలె పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు భారత సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసే విధానాన్ని వక్తలు ప్రశంసించారు. విద్యార్ధుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.