ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti: అక్రమాలకు అడ్డగా ‘ధరణి’

ABN, First Publish Date - 2022-11-17T11:09:53+05:30

కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ‘‘ధరణి’’ రైతులకు బాధలను, దళారులకు డబ్బులను తెచ్చిపెడుతోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ (KCR Government) ప్రవేశపెట్టిన ‘‘ధరణి’’ (Dharani) రైతులకు బాధలను, దళారులకు డబ్బులను తెచ్చిపెడుతోందని బీజేపీ నేత విజయశాంతి (Vijayashanti) విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... ధరణిలో ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయన్నారు. ధర కోట్ల రూపాయల్లో ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్​చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారని.... అదీ ప్రభుత్వ భూమి, అటవీ, వక్ఫ్‌‌, దేవాదాయ, అసైన్డ్​ ల్యాండ్ అయినా సరే పైసలిస్తే చాలు.. పనైపోతుందని అన్నారు. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవహారం గుట్టుగా కొనసాగుతోందని బీజేపీ నేత అన్నారు.

గత వారం నుంచి ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఉన్న భూములపై హైదరాబాద్​ సీసీఎల్ఏ ఆఫీసులో స్పెషల్​ మీటింగులు పెడుతూ ఆ లిస్ట్​లో నుంచి కొన్నింటిని తీసేస్తున్నారన్నారు. ఇదే అదునుగా అర్హతలేని వాటిని కూడా ఈ జాబితాలో నుంచి తొలగించారని తెలిపారు. ఈ క్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్నారు. ప్రొహిబిటెడ్​ లిస్టులో ఉన్న సర్వే ననంబర్ తొలగించుకునేందుకు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ. కోటి దాకా కూడా పెడుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎకరం ధర రూ.5 కోట్లు ఉండగా.. ఆ సర్వే నంబర్​ ప్రొహిబిటెడ్​ జాబితాలో ఉంటే దానిని తీయించుకునేందుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ముడుపులు తీసుకుంటున్నారన్నారు. ఇలా అన్నదాతలను ఆగం చేస్తున్న కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ రైతాంగమే తగిన శాస్తి చేస్తుందని విజయశాంతి (BJP Leader)హెచ్చరించారు.

Updated Date - 2022-11-17T11:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising