Vijayashanti: బీఆర్‌ఎస్ పేరిట బీరాలు పలకడం విడ్డూరం

ABN, First Publish Date - 2022-12-14T10:05:17+05:30

బీఆర్‌ఎస్ పార్టీపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు.

Vijayashanti: బీఆర్‌ఎస్ పేరిట బీరాలు పలకడం విడ్డూరం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party)పై బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ (Telangana CM KCR) దత్తత తీసుకున్న ఊరిని ఉద్ధరించే దిక్కులేదు గానీ, భారతదేశాన్ని నడిపిస్తానంటూ బీఆర్‌ఎస్ పేరిట బీరాలు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు. రెండేళ్ల కిందట దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ ఆ ఊరిని ఇప్పుడు అథోగతి పాలు చేశారని మండిపడ్డారు. కొత్త లే అవుట్‌లో గ్రామంలో ఉన్న మొత్తం 570 కుటుంబాలకు 200 గజాల చొప్పున స్థలంలో ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించి రోడ్డు నిర్మాణం కోసం కొందరి ఇళ్లు కూల్చేశారన్నారు. సెంట్రల్‌ లైటింగ్‌, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రం, బడి భవనం, పంచాయతీ ఆఫీస్ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులంటూ సుమారు రూ.150 కోట్లకు పైగా ప్రతిపాదనలు సర్కారుకు పంపించారని అన్నారు. వీటికి నేటి వరకు ఎటువంటి నిధులు రాలేదని... చివరికి వాసాలమర్రిలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయని బీజేపీ నేత విమర్శించారు.

ఊరి ప్రజలకు నూతన గృహాలు ఇస్తామన్న సర్కారు అదేమీ చేయలేదు.... సరికదా, గ్రామస్థులెవరైనా తామే స్వంతంగా ఇల్లు కట్టుకుంటామన్నా అనుమతివ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కొన్నిపాత ఇళ్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయని... ఆ యజమానులు కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలని గ్రామపంచాయతీలో అనుమతి అడిగితే నిరాశే ఎదురవుతోందని తెలిపారు. మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే... నూతన లే అవుట్‌లలో 200 గజాల్లోనే ఇళ్లు కట్టిస్తామని సర్కారు చెప్పగా... అంతకన్నా ఎక్కువ స్థలం ఉండి.. ప్రభుత్వానికి అప్పగించేవారి పరిస్థితి... ఎక్కువ స్థలం ఇస్తే పరిహారం సంగతి ఏంటన్న విషయాలపై అంతా మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చి కొత్తవి నిర్మిస్తే ఆ లోగా పునరావాసం సంగతేంటో తెలియదన్నారు. ఇలా గ్రామంతో ముడిపడిన పలు అంశాలపై ఇటీవల నిర్వహించిన గ్రామసభ గందరగోళంగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా దత్తత తీసుకున్న ఊరికే దిక్కులేని పరిస్థితుల్లో దేశానికి ఇంకేం చేస్తారో ఊహించుకుంటేనే భయంగా ఉందని విజయశాంతి విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-12-14T10:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising