ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Moinabad farmhouse: కత్తి బీజేపీది కాదు.. నెత్తి బీజేపీది కాదు.. దొరికినోళ్లు టీఆర్‌ఎస్ వాళ్లే

ABN, First Publish Date - 2022-10-28T10:23:25+05:30

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్ వ్యవహారంపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్ (Moinabad farmhouse) వ్యవహారంపై బీజేపీ నేత విజయశాంతి (Vijayashanti) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘కేసీఆర్ (KCR) గారి వింత విచిత్ర విన్యాసం వారి మాటల్లోనే చెప్పాలంటే... కత్తి బీజేపీ (BJP)ది కాదు... నెత్తి బీజేపీది కాదు. దొరికిన అందరూ టీఆర్ఎస్ వాళ్ళే... నడిపించిన మొత్తం కథ కూడా వాళ్లదే. అయ్య ఆణిముత్యం చేసిన ప్రయోగాన్ని సమర్ధించుకోలేక... స్వయంగా కుమారుల వారే టీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడొద్దని పోస్ట్ ఇచ్చారు. (మాట్లాడిన కొద్ది.. వారి మోసం ఎక్కువ బయట పడతదనే అనుమానంతో...) స్టేట్ పోలీస్ టీఆర్ఎస్‌దే... ఏసీబీ కూడా వారి నియంత్రణే... దొరికిన డబ్బు ఆధారాలు చూపట్లేదు. బీజేపీ పేరు పెట్టవలసిన అవసరం ఈ తల తక్కువ కేసులో అంతకన్నా లేదు. అందుకే, న్యాయం కోసం బీజేపీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అధ్వాన్నపు ప్రయత్నం అవకతవకగా చేసి, టీఆర్ఎస్ అడ్డగోలుగా ఈ ప్రయత్నంలో దొరికిపోయినట్టుగా తెలంగాణ ప్రజలు (Telangana people) అభిప్రాయపడుతుండటం ప్రస్తుతం నడుస్తున్న పరిణామం’’ అంటూ విజయశాంతి (BJP Leader) వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-10-28T10:27:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising