ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kunamneni Sambashivarao: చలనచిత్ర రంగంలో ప్రయోగాలకు మారుపేరు కృష్ణ

ABN, First Publish Date - 2022-11-15T09:39:02+05:30

ప్రముఖ చలనచత్ర నటుడు గంటమనేని కృష్ణ మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ చలనచత్ర నటుడు గంటమనేని కృష్ణ (Superstar Krishna Death) మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashivarao) ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఎన్నో మంచి సామాజిక చిత్రాలను తీసి ప్రేక్షకుల్ని అలరించారన్నారు. అల్లూరి సీతారామరాజు (Alluri sitaramaraju Film) చిత్రం ద్వారా మన్యం వీరుని చరిత్రను ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. చలనచిత్ర రంగంలో ప్రయోగాలకు మారుపేరు కృష్ణ (Super Star)అని కొనియాడారు. ఆయన పరోపకారి, సేవాగుణం, తోటి నటినటుల పట్ల మర్యాద, సాహసం, ధైర్యం కలిగిన నటుడు అని అన్నారు. ఆయన చేసిన సినిమాలు నష్టాలలో వచ్చి నిర్మాత ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఉచితంగా సినిమాలు తీసి తోడ్పాటు అందించేవారని గుర్తుచేశారు. సినీ రంగంలో సూపర్ స్టార్ ఎవరు అనేదానిపై ఆనాటి సినీ పత్రిక జ్యోతి చిత్ర చేసిన ఓటింగ్లో వరుసగా మూడు సంవత్సరాలు కృష్ణకు మద్దతు ప్రకటించారన్నారు. ఆయన మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటని తెలిపారు. ఆయన మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు కూనంనేని సాంబశివరావు (CPI State Secretary) తన సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2022-11-15T09:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising