Ligar: లైగర్ సినిమాలో పెట్టుబడులపై ముగిసిన ఈడీ విచారణ.. పూరీ, చార్మీని 12 గంటలు ప్రశ్నించిన అధికారులు
ABN, First Publish Date - 2022-11-17T22:05:18+05:30
సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath), హీరోయిన్ చార్మీ (Charmi) ఈడీ (ED) విచారణ ముగిసింది. లైగర్ సినిమా (Ligar movie)లో పెట్టుబడులపై పూరీ జగన్నాథ్, చార్మీని 12 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు.
హైదరాబాద్: సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath), హీరోయిన్ చార్మీ (Charmi)పై ఈడీ (ED) విచారణ ముగిసింది. లైగర్ సినిమా (Ligar movie)లో పెట్టుబడులపై పూరీ జగన్నాథ్, చార్మీని 12 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. లైగర్ సినిమాలో విదేశీ పెట్టుబడులపై ఇద్దరిని ఈడీ ప్రశ్నించింది. హవాలా, మనీలాండరింగ్ రూపంలో పెట్టుబడులు వచ్చినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. లైగర్ చిత్రంలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు అనుమానం వెలుబుచ్చింది. పూరీ, చార్మి బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నిధులు వచ్చినట్లు తెలవడంతో 20 రోజుల క్రితమే పూరీ జగన్నాథ్, చార్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
Updated Date - 2022-11-17T22:20:53+05:30 IST