Jaggareddy: షర్మిల పాదయాత్ర అడ్డుకోవడం సరికాదు..
ABN, First Publish Date - 2022-11-30T14:51:04+05:30
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) పాదయాత్ర (Padayatra)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) స్పందించారు.
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) పాదయాత్ర (Padayatra)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల కంటే.. రాజకీయ పోరాటం ఎక్కువైందని, ఎవరైనా స్వేచ్ఛగా పోరాటం చేసే హక్కు ఉందని, షర్మిల పాదయాత్ర అడ్డుకోవడం సరికాదని అన్నారు. షర్మిలపై దాడి.. అరెస్ట్ ఖండిస్తున్నామన్నారు. బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS), షర్మిల వ్యవహారం అంతా రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. షర్మిల రాజకీయం వెనక ఉన్నది ఎవరు?.. టీఆర్ఎస్‌కు ఉపయోగ పడేలా చేస్తున్నారా? లేక బీజేపీకి ఉపయోగ పడేలా చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోందని, తెలంగాణలో కన్ఫ్యూజ్ రాజకీయం నడుస్తుందని అన్నారు. ఇప్పుడు పాదయాత్రలు చేయడం ఫ్యాషన్ అయ్యిందని, వ్యక్తిగా ఇమేజ్ పెంచుకునే పనిలోనే ఉన్నారని, సమస్యలపై చేయడం లేదని విమర్శించారు. బండి సంజయ్ సమస్యల గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. అందరూ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చాలని కుట్ర చేస్తున్నారని, టీఆర్ఎస్‌కు అనుకూలించే రాజకీయం చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.
Updated Date - 2022-11-30T14:51:09+05:30 IST