Twitter war: రేవంత్ రెడ్డి ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
ABN, First Publish Date - 2022-11-30T11:42:05+05:30
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (Kavitha)-టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మధ్య ట్విట్టర్ వార్ (Twitter war) నడుస్తోంది.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (Kavitha)-టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మధ్య ట్విట్టర్ వార్ (Twitter war) నడుస్తోంది. రేవంత్ ట్వీట్‌కు కవిత కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబు (Chandrababu) తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వారు.. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం, బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం.. మహిళల పట్ల మీకున్న గౌరవాన్ని తెలియజేస్తోంది’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.
కేసీఆర్ (KCR) తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టిన రోజును దీక్షా దీవాస్‌గా పేర్కొంటూ టీఆర్ఎస్ (TRS) పార్టీ పెద్ద ఎత్తున ట్వీట్లు చేసింది. దీకికి కౌంటర్‌గా మంగళవారం కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, బలిదానాలవైపు నడిపించి.. కేసీఆర్ సీఎం కుర్చీ ఎక్కారంటూ ట్వీట్ చేసింది. దీనికి కౌంటర్‌గా తెలంగాణ ద్రోహులకు అడ్డాగా కాంగ్రెస్ పార్టీ అంటూ కవిత ట్వీట్ చేశారు. దీనిపై రేవంత్ రేడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘వంటావార్పులో పప్పన్నం తిన్నందుకు, బతుకమ్మ ఆడినందుకు, బోనం కుండలు ఎత్తినందుకు మీ ఇంటిల్లిపాది సకల పదవులు అనుభవిస్తోంది.. భోగభాగ్యాలు అనుభవిస్తోంది. తెలంగాణ కోసం చిరునవ్వుతో ఆత్మబలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు ఎక్కడా కనిపించడంలేదు’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. దానికి కౌంటర్‌గా కవిత బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు.
Updated Date - 2022-11-30T11:42:09+05:30 IST