MLAs purchase case: చంచల్‌గూడ జైల్లో నందకుమార్ విచారణ
ABN, First Publish Date - 2022-12-26T12:50:19+05:30
మ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchase case)లో నిందితుడు నందకుమార్ (Nandakumar)ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. చంచల్‌గూడ (Chanchalguda Jail) జైల్లో బ్యారక్
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchase case)లో నిందితుడు నందకుమార్ (Nandakumar)ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. చంచల్‌గూడ (Chanchalguda Jail) జైల్లో బ్యారక్ నుంచి ఒక ప్రత్యేక గదికి నందకుమార్‌ను తరలించారు. ప్రత్యేక గదిలో ముగ్గురు అధికారులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లు సుమిత్ గోయల్, దేవేంద్ర కుమార్ సింగ్, మరో అధికారి.. నందకుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. చంచల్‌గూడ జైలుకు వచ్చే ముందు ఈడీ అధికారులు(ED officials) కోవిడ్ పరీక్షలు(Covid tests) చేయించుకుని వచ్చారు. కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్‌ను జైలు అధికారులకు చూపించాలని కోర్టు సూచించింది. దీంతో నెగిటివ్ రిపోర్టు(Covid negative report)ను జైలు సూపరింటెండెంట్‌కు అధికారులు చూపించారు. దీంతో ప్రత్యేక గదిలో నందకుమార్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
Updated Date - 2022-12-26T13:08:37+05:30 IST