DGP Mahender Reddy: తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్
ABN, First Publish Date - 2022-12-29T14:03:08+05:30
రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే 4.44 శాతం క్రైమ్ రేట్ పెరిగినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే 4.44 శాతం క్రైమ్ రేట్ పెరిగినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) తెలిపారు. గురువారం 2022 క్రైమ్ వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 57 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాదిలో 120 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా సేవలు అందించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ శాఖ ముందుకు వెళ్ళిందని చెప్పారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలతో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లు చేసి విజయవంతం అయినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కమ్యూనల్ గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. టెర్రర్ అటాక్ జరకుండా, ముందుగానే పసిగట్టి ఎలాంటి దాడులు జరగకుండా చేశామని చెప్పుకొచ్చారు. సీఐ సెల్, ఇంటెల్‌జెన్స్ వ్యవస్థ చాలా బాగా పని చేసిందని అన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా శాంతి భద్రతలను పరిరక్షిణించామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-12-29T14:19:38+05:30 IST