Kishan Reddy: ఆ నలుగురు బీజేపీలోకి వస్తే ఏంటి?.. రాకపోతే ఏంటి?
ABN, First Publish Date - 2022-10-28T12:06:23+05:30
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కథలు అల్లారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కథలు అల్లారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ముందు వంద కోట్లు అన్నారు.. తర్వాత రూ.15 కోట్లు అన్నారని... చివరకు ఆధారాలు చూపించలేకపోయారని తెలిపారు. ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ కేసీఆర్ (KCR) అని విమర్శించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రుల్ని చేయలేదా? అని ప్రశ్నించారు. ఇదేదో తొలిసారి జరుగుతున్నట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. నందు తెలుసు కానీ... ఆయన తన అనుచరుడు కాదని స్పష్టం చేశారు. నందు ఇప్పుడు టీఆర్‌ఎస్ (TRS)లోనే ఉన్నారన్నారు. ఎవరైనా పదువులకు రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. ఆ నలుగురిని తమ పార్టీలో చేర్చుకుంటే ప్రభుత్వం పడిపోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని ప్రచారం చేశారన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఆ నలుగురు మా పార్టీలోకి వస్తే ఏంటి?.. రాకపోతే ఏంటి అని అన్నారు. ‘‘మీ నుంచి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీలాగా మా దగ్గర అంత డబ్బు లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించడం ఖాయం’’ అని స్పష్టం చేశారు. బీజేపీ ముందు విఠలాచార్య సినిమాలు పనిచేయవన్నారు. కేసీఆర్ ఢిల్లీలో కాకుంటే ఎక్కడైనా ప్రెస్‌మీట్ పెట్టుకోవచ్చని కిషన్‌రెడ్డి (Union minister) తెలిపారు.
Updated Date - 2022-10-28T12:31:44+05:30 IST