ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti :రాహుల్‌ జోడోయాత్ర ఇలాంటి విషప్రచారం కోసమేనేమో..

ABN, First Publish Date - 2022-11-21T18:30:15+05:30

దేశం కోసం కఠిన కాలాపానీ జైలులో క్రూరాతి క్రూర శిక్షలకు గురైన మహనీయుడు వినాయక్ దామోదర్ సావర్కర్(Vinayak Damodar Savarkar)ని నిందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi) పదే పదే విమర్శిస్తూ పొరపాటు చేస్తున్నారని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

Vijayashanti
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశం కోసం కఠిన కాలాపానీ జైలులో క్రూరాతి క్రూర శిక్షలకు గురైన మహనీయుడు వినాయక్ దామోదర్ సావర్కర్(Vinayak Damodar Savarkar)ని నిందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పదే పదే విమర్శిస్తూ పొరపాటు చేస్తున్నారని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. సోమవారం రాములమ్మ సోషల్ మీడియా(Social media)లో ఓ వార్తను పోస్ట్ చేశారు. ఈ వార్తను యథప్రకారం ప్రచురిస్తున్నాం. ‘‘సావర్కార్ నాడు బ్రిటిష్(British) అధికారులకు ఇచ్చిన లేఖలో వాడిన పదజాలం గురించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. అదే పదజాలాన్ని ఆనాడు బ్రిటిషర్ల ద్వారా జైలుపాలైన ఎందరో నేతలు... గాంధీ, నెహ్రూ(Gandhi Nehru) సహా చాలామందే తమ లేఖల్లో ఉపయోగించిన రుజువులు ఇప్పటికే బయటకొచ్చాయి. అంతేకాదు సావర్కర్‌ని రాహుల్ నానమ్మ, దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) ఎంతగా అభిమానించారో రాహుల్‌కి తెలియకపోవడం ఎంతో విచారకరం. ఇందిరా గాంధీ సావర్కర్ స్టాంప్(Savarkar stamp) విడుదల చేయించారు, ముంబై (Mumbai)లో సావర్కార్ స్మారకం కోసం వ్యక్తిగతంగా రూ.11 వేలు విరాళం ఇచ్చారు. సావర్కార్ జన్మస్థలాన్ని సైతం ఇందిర సందర్శించారు. కాంగ్రెస్ నేతలు (Congress leaders) ఒక్కసారైనా సావర్కర్ జీవితచరిత్ర చదివితే ఈ నిజాలు తెలుస్తాయి. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర(Bharat Jodoyatra) కేవలం ఇలాంటి విషప్రచారం కోసమేనేమో అనిపించేలా ఉండటం సమంజసం కాదు’’ అని విజయశాంతి ఆక్షేపించారు.

Updated Date - 2022-11-21T18:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising