ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharmila: సంకాంత్రి తరువాత పాదయాత్ర కొనసాగుతుంది

ABN, First Publish Date - 2022-12-14T12:11:33+05:30

పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ అడుగడుగునా ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ అడుగడుగునా ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.... పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి కేసీఆర్ సర్కార్‌కు మొట్టికాయ వేసిందన్నారు. నిరహార దీక్ష చేస్తుంటే వందల మంది పోలీసులతో కర్ఫ్యు విధించారన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా కేసీఆర్ అధీనంలోకి వెళ్ళిందని ఆరోపించారు. తనను కట్టడి చేసిన పోలీసులపై కేసు పెట్టనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలను, మీడియాను కూడా పార్టీ ఆఫీసుకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ఉనికి కాదని బందిపోట్ల రాష్ట్ర సమితిని పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణని దోచుకున్నది అయిపోయిందని... ఇక దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని అన్నారు. అనారోగ్య కారణం వల్ల సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రకటించారు.

పొట్టోడు పొడుగొడు కొడితే పొడుగొడిని పోషమ్మ కొడుతుందట అంటూ యెద్దేవా చేశారు. మా బ్యానర్స్ కేసీఆర్ పార్టీ వాళ్ళు చింపేశారు.కేసీఆర్ ఫ్లెక్సీలు ఇంకొకరు చించేశారన్నారు. కేసీఆర్ కిసాన్ ద్రోహి అని ఆయన కిసాన్ సర్కార్ అనడం ఏంటి అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక టోపీ పెట్టుకొని పిట్టలదొర లాగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. సమస్యలతో తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ ఇతర రాష్ట్రాల రైతులకు చెక్కులు ఇస్తున్నారన్నారు. కవిత బతుకమ్మ ఆడుతూనే బతుకమ్మ పూలు తెలంగాణ ప్రజల చెవిలో పెడుతోందని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూతురు కాకుంటే కవిత పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. స్కూటర్‌పై తిరిగే కేసీఆర్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. లిక్కర్ స్కాం ద్వారా కవిత మహిళలనే కాదు తెలంగాణ ప్రజల పరువు తీసిందని మండిపడ్డారు. వైఎస్సార్ ఉన్నప్పుడు తాను ఒక్క పదవి కూడా తీసుకోలేదని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు మేం గెలుస్తామని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-14T12:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising