Minister KTR: యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్

ABN, First Publish Date - 2022-12-20T14:39:30+05:30

చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు.

Minister KTR: యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) సీరియస్ అయ్యారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతలపై మంత్రి ఆరా తీశారు. మూడపల్లి యువతి కిడ్నాప్ నిందితులను సాయంత్రంలోపు పట్టుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే...

జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో షాలిని అనే యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. తండ్రి చంద్రయ్యతో కలిసి షాలిని హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా కిడ్నాప్‌కు గురిైంది. దేవాలయం వెలుపల కారులో కాపు కాసిన నలుగురు యువకులు... యువతి బయటకు వచ్చిన వెంటనే తండ్రిని కొట్టి బలవంతంగా లాక్కెళ్లారు. యువతిని బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేశాడు. యువతి కిడ్నాప్‌కు సంబంధించి ఫోక్సో కేసులో జైలుకి వెళ్లి వచ్చిన యువకుడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2022-12-20T14:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising