MP Arvind: కవిత రాజకీయ జీవితం ముగిసింది
ABN, First Publish Date - 2022-11-18T19:03:24+05:30
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) రాజకీయ జీవితం ముగిసిందని ఎంపీ అర్వింద్ (MP Arvind) జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ఇందూరులోనే తనపై కవిత పోటీ చేయాలని సవాల్ విసిరారు.
నిజామాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) రాజకీయ జీవితం ముగిసిందని ఎంపీ అర్వింద్ (MP Arvind) జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ఇందూరులోనే తనపై కవిత పోటీ చేయాలని సవాల్ విసిరారు. కవిత ఎక్కడ నిల్చున్నా డిపాజిట్ (Deposit) రాదని జోస్యం చెప్పారు. సింపతీ కోసమే తమపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. పసుపు రైతులు 71 మంది బీజేపీలో చేరారని తెలిపారు. తన ఇంటిపై దాడి ఘటనపై డీజీపీ మహేందర్‌రెడ్డి (DGP Mahender Reddy) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహేందర్‌రెడ్డి లాంటి యూజ్ లెస్ ఆఫీసర్‌ను చూడలేదన్నారు. టీఆర్‌ఎస్‌కు కొందరు పోలీసులు అమ్ముడుపోయారని అర్వింద్ ఆరోపించారు.
అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు(TRS Activists) దాడికి పాల్పడ్డారు. కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. ఆ సమయంలో అర్వింద్ నిజామాబాద్‌లో ఉన్నారు. బంజారాహిల్స్‌లోని ఎంపీ ఇంట్లోకి టీఆర్ఎస్ కార్యకర్తలు చొరబడి అద్దాలు పగలగొట్టారు. ఇంట్లో పర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించారు.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కార్యకర్తలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
‘ఇష్టం వచ్చినట్లు వాగితే.. నిజామాబాద్ చౌరస్తాలో అర్వింద్‌ను చెప్పుతో కొడతానని’ కవిత ఘాటుగా హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. మరోవైపు అర్వింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు కూడా ప్రగతిభవన్ ముట్టడికి వ్యూహం రచించారు. బీజేపీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు-బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్.. టెన్షన్‌గా మారింది. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
Updated Date - 2022-11-18T19:03:26+05:30 IST