Rega Kantharao: ఈడీ, బోడీ, మోదీలకు భయపడే రోజులు పోయాయి
ABN, First Publish Date - 2022-12-28T09:18:43+05:30
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై గత అర్ధరాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు (Pinapaka MLA Rega Kantha Rao)సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై గత అర్ధరాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈడి,బోడి, మోడీలకు భయపడే రోజులు పోయాయి.. సంవత్సర కాలంలో దొంగలపాలన పోయి.. దేశ ప్రజలకు కేసీఆర్ నాయకత్వంలో స్వేచ్ఛ స్వాతంత్రయాలు గల నీతివంతమైన పాలన వస్తుంది. తెలంగాణ బోర్డర్ బీజేపీ పాలన రాష్ట్ర ప్రజలు తెలంగాణ పథకాలు అమలు చేస్తారా లేక మా గ్రామాలను తెలంగాణలో కలుపుతారా అని ప్రశ్నింస్తుంటే సిగ్గు పడాలి బీజేపీ నాయకులు. గతంలో ఈడి నోటీసులు వస్తే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి.. ఇప్పుడు నోటీసులు వస్తే దొంగలు పండుగ చేసుకునే రోజులు వచ్చాయి.. ఇంతగా అభివృద్ధి చెందింది దేశం బీజేపీ కాలంలో. జై తెలంగాణ.. జై జై భారత్.. జయహో కేసీఆర్’’ అంటూ రేగా కాంతారావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Updated Date - 2022-12-28T09:18:44+05:30 IST