ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghunandanrao: నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా?

ABN, First Publish Date - 2022-12-06T13:08:26+05:30

నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధిపేట: నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూంల కేటాయింపులో కక్ష్య పూరితంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురై కలెక్టరేట్ ముందు ఆత్మహత్య చేసుకున్న రమేష్ మృతదేహానికి బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. సిద్దిపేటలో డబుల్‌బెడ్‌రూం ఇల్లు రావాలంటే ఎన్ని అవినీతి పనులు చేయాలో రమేష్‌ మృతి విషయంలో తెలుస్తోందన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారణ జరిపి ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ... కేసీఆర్ ఇలాకాలో దళితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసులతో బెదిరించి విషయం బయటకు పొక్కకుండా దాస్తున్నారని విమర్శించారు. ధరణి కారణంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉంటేనే సంక్షేమ పథకాలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడిపిస్తున్న కేసీఆర్ వారికి న్యాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-06T13:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising