TS News: డబుల్ బెడ్రూం ఇళ్లలో పేరు లేదంటూ...
ABN, First Publish Date - 2022-12-16T12:10:53+05:30
సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో పేద కుటుంబానికి అవమానం జరిగింది.
సిద్దిపేట: సీఎం కేసీఆర్ నియోజకవర్గం (CM KCR Constituency) గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో పేద కుటుంబానికి అవమానం జరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల (Double Bed Room Houses)లో పేరు లేదని లబ్దిదారులు లేని సమయంలో గ్రామ సిబ్బంది ఇంట్లో సామాన్లను బయట వేసి ఇంటికి తాళం వేశారు. అయితే ఫస్ట్లిస్ట్లో పేరు ఉండటంతో గృహ ప్రవేశం చేయించి ఇప్పుడు పేరు లేదని చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల కింద మంత్రి హరీష్రావు చేతులు మీదుగా జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి విచారణ చేపట్టారు.
Updated Date - 2022-12-16T12:11:22+05:30 IST