ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS MLAs Poaching Case: హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-12-26T20:05:23+05:30

తెలంగాణ హైకోర్టును ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టును ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు (High Court) తీర్పుపై లాయర్‌తో మాట్లాడానని తెలిపారు. తీర్పు కాపీ ఇంకా రాలేదు.. వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈడీ, సీబీఐ (ED CBI) ని ప్రయోగిస్తామని దొంగ స్వాములు ముందే చెప్పారని, వారు చెప్పినట్లే జరుగుతోందని తెలిపారు. ఈడీ విచారణలో ఎలాంటి అంశం దొరకలేదని, దాంతో ఇప్పుడు సీబీఐని రంగంలోకి దింపుతున్నారని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘సిట్‌ను తప్పించి కేసును సీబీఐకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. ఈడీ పరిధిలోకి రాకపోయినా నన్ను విచారణకు పిలిచారు. న్యాయవ్యవస్థలో ఉన్న సాంకేతిక అంశాలు అడ్డుపెట్టుకుని.. బీజేపీ నేతలు విచారణకు రావడం లేదు. ఈడీ, సీబీఐ ఏది వచ్చినా మేము సిద్ధం. ఈడీ విచారణపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. నా తమ్ముడు ఎప్పుడూ గుట్కా వ్యాపారం చేయలేదు. నన్ను, నా కుటుంబీకులను కావాలని ఇబ్బంది పెడుతున్నారు’’ అని రోహిత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-26T20:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising