ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi: బీజేపీ, టీఆర్ఎస్ ప్రజల గొంతు నొక్కేస్తున్నాయి

ABN, First Publish Date - 2022-10-30T19:34:38+05:30

పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలతో మాట్లాడుతున్నానని, హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నానని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.

Rahul gandhi, congress
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మహబూబ్‌నగర్‌ (Mahabubnagar )జిల్లాలో పర్యటిస్తున్నారు. పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలతో మాట్లాడుతున్నానని, హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నానని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు తమ గోడు చెప్పుకుంటున్నారని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజల గొంతు నొక్కేస్తున్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదని, తెలంగాణలో విద్యావ్యవస్థ ప్రైవేట్ పరమైందని విమర్శించారు. యువత నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇబ్బందులు పడుతోందని రాహుల్‌ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను టీఆర్ఎస్ సర్కార్ నిలిపివేసిందని, ఉద్యోగాలు ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించాలని రాహుల్ సూచించారు.

Updated Date - 2022-10-30T19:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising