ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rohit Reddy : కేంద్రం, ఈడీ డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టులో రోహిత్‌రెడ్డి పిటిషన్

ABN, First Publish Date - 2022-12-27T16:27:01+05:30

ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఈడీ, ఈడీ డైరెక్టర్‌, ఈడీ హైదరాబాద్ జోన్ డైరెక్టర్‌లను రోహిత్‌రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఈడీ ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌‌ (Petition)లో పేర్కొన్నారు. మనీలాండరింగ్ కింద నోటీసులిచ్చి వేధిస్తున్నారని, ఈడీ ecirను కొట్టివేయాలని హైకోర్టును రోహిత్‌రెడ్డి ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈడీ విచారణపై హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. తన పిటిషన్ గురువారం విచారణకు వస్తుందని, ఇవాళ ఈడీ విచారణకు వెళ్లాలా వద్దా అనేదానిపై.. తమ లాయర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తమ లాయర్లు ఎలా చెబితే అలా చేస్తానని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’ కేసును సీబీఐ (CBI)కి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేయడానికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో(నంబరు 63)ను న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పటివరకు సిట్‌ చేసిన దర్యాప్తును, సిట్‌ ఏర్పాటుకు ముందు దర్యాప్తు అధికారి(ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌) చేసిన దర్యాప్తును కొట్టేసింది. హైకోర్టు తీర్పు సీఎం కేసీఆర్‌ (CM KCR) కు షాక్ అనే చెప్పాలి. ఈ కేసులో అనుకున్నది ఒకటైతే... మరోటి అయ్యిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించడం రాజకీయంగా బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కేసు ద్వారా కేంద్రంలోని బీజేపీని ఇబ్బంది పెట్టాలని భావించిన బీఆర్‌ఎస్‌.... స్వయంగా తానే ఇబ్బందిపడే వాతావరణం తలెత్తడం గమన్హారం.

Updated Date - 2022-12-27T16:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising