కేటీఆర్ కిడ్నీలు, వెంట్రుకలు, గోళ్లు ఎవరికి కావాలి?: అర్వింద్
ABN, First Publish Date - 2022-12-20T21:20:39+05:30
మంత్రి కేటీఆర్ (KTR) పై బీజేపీ (BJP) ఎంపీ అర్వింద్ (MP Arvind) మండిపడ్డారు.
ఢిల్లీ: మంత్రి కేటీఆర్ (KTR) పై బీజేపీ (BJP) ఎంపీ అర్వింద్ (MP Arvind) మండిపడ్డారు. కేటీఆర్ కిడ్నీలు, వెంట్రుకలు, గోళ్లు ఎవరికి కావాలన్నారు. కేటీఆర్ మిత్రులు డ్రగ్స్ కేసులో ఉన్నందున ఆయనపై పదేపదే ఆరోపణలు వస్తున్నాయని అర్వింద్ ఆరోపించారు. కేటీఆర్ స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. లిక్కర్ కేసులో కవిత, ఫినిక్స్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. దర్యాప్తు సంస్థలతో తమకు సంబంధం లేదన్నారు. వాటిపని అవి చేసుకుపోతాయన్నారు.
Updated Date - 2022-12-20T21:20:44+05:30 IST