TS News: ఆ ఘనత ప్రధాని మోదీదే : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ABN, First Publish Date - 2022-11-17T20:21:41+05:30
Jangaon: కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) జనగామ జిల్లాలో పర్యటించారు. అక్కడ కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారితో సమావేశమై మాట్లాడారు.
Jangaon: కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) జనగామ జిల్లాలో పర్యటించారు. అక్కడ కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారితో సమావేశమై మాట్లాడారు. ప్రధాని మోదీ (PM Modi) ఆధ్వర్యంలో దేశం ముందుకెళ్తోందని, భారతదేశం 11 ఆర్థిక స్థాయి నుంచి ఐదో స్థాయికి చేరిందని చెప్పారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 21 వేల మంది విద్యార్థులను మన దేశానికి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీదేనన్నారు. దేశంలో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం గురించి ఆయన మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో వచ్చిన 5G స్పెక్ట్రమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలని కోరారు.
Updated Date - 2022-11-17T20:21:43+05:30 IST